శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 12, 2020 , 02:02:54

ఊరూరా పల్లెప్రగతి

ఊరూరా పల్లెప్రగతి
  • -స్వచ్ఛందంగా పాల్గొంటున్న పల్లె ప్రజలు
  • -భాగస్వాములవుతున్నఅధికారులు, డాయిపేట, బోదంపల్లిలోపనులు పరిశీలించిన జడ్పీ సీఈవో వేణు
  • -మూడు మండలాలను కలియదిరిగిన డీఆర్డీవో వెంకటశైలేశ్‌


జిల్లాలో పల్లెప్రగతి ఊరూరా సాగింది. శనివారం పదోరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా అభివృద్ధి, పారిశుధ్య పనుల్లో భాగస్వాములవుతున్నారు. అదేవిధంగా పలు మండలాల్లో పర్యటిస్తూ పనులు పరిశీలిస్తున్నారు. జైనూర్‌ మండలంలోని జంగాం గ్రామంలో  ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడారు. పల్లెప్రగతితో గ్రామాలను మరింత అభవృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. సిర్పూర్‌ టి మండలం వేంపల్లి,  కౌటాల మండలం తలోడిలో, బెజ్జూర్‌ మండలకేంద్రంలో డీఆర్‌డీవో వెంకట శైలేష్‌ పర్యటించారు. ఆయా చోట్ల శ్మశాన వాటికి, డంప్‌యార్డు, నర్సరీలను పరిశీలించారు.పలు సూచనలు చేశారు. అదేవిధంగా  కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడపీవో కార్యాలయంలో జడ్పీ సీఈవో వేణు పార్డీ, సాండ్‌గాం గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు


logo