బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 12, 2020 , 02:08:10

ప్రశాంతంగా నవోదయ పరీక్ష

ప్రశాంతంగా నవోదయ పరీక్ష


కాగజ్‌నగర్‌ రూరల్‌: జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ఖాళీగా ఉన్న 80 సీట్లకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా కొన సాగింది.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5042 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4290 మం ది ప్రవేశ పరీక్ష రాశారు. 752 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు.  కాగజ్‌నగర్‌తో పాటు సిర్పూర్‌ టి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని పరీక్షా కేం ద్రాలను జేసీ రాంబాబు  తనిఖీ చేశారు.logo