బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 12, 2020 , 02:06:14

తేజాపూర్‌ చేరుకున్నమెస్రం వంశీయులు

తేజాపూర్‌ చేరుకున్నమెస్రం వంశీయులు


ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ: నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజకు గంగాజలం తెచ్చే క్రమంలో మెస్రం వంశీయుల యాత్ర శనివారం సాయంత్రానికి తేజాపూర్‌కు చేరుకుంది. ఉట్నూర్‌ నుంచి ధర్ముగూడ మీదుగా వీరు తేజాపూర్‌ చేరుకున్నారు. ఈ నెల 14న మంచిర్యాల జిల్లా కలమడుగుకు చేరుకొని గంగాజలం సేకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 24న మహాపూజ చేస్తామన్నారు. అనంతరం జాతర ప్రారంభించనున్న ట్లు తెలిపారు.  ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో తుకుడోజీ, వెంకట్‌రావు, తి రుపతి, బాజీరావు, చిన్ను పటే ల్‌, బాదీరావు, లింబారావు, క టోడ హనుమంత్‌రావు, పర్ధాం జీ, మనోహర్‌, దుర్గు,కోశరావు, నాగోరావు, పణపతి, దాదారావు, పాండ్‌రంగ్‌, తుకారాం పాల్గొన్నారు.


logo