మంగళవారం 07 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 10, 2020 , 12:10:40

నూతనోత్సాహంతో విధులు నిర్వహించాలి

నూతనోత్సాహంతో విధులు నిర్వహించాలి

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: నూతనోత్సాహంతో పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కొత్త సంవత్సరం నేరాల సం ఖ్య తగ్గుముఖం పట్టి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. పోలీసు దర్యాప్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేసు నమోదు నుంచి చార్జిషిట్ వరకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా అధికారులు పర్యవేక్షణలో కొనసాగాలని సూచించారు.కోర్టు మానిటరింగ్ సిస్టం (సీఎంఎస్) పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశపెట్టే ప్రక్రియను కొనసాగించాలని తెలిపారు. ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించే క్రమంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వాహనాలను తనిఖీలు చేపట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 2020లో సురక్షితమైన ఏడాదిగా కొనసాగించాలనే ప్రధాన ప్రణాళిక ఆలోచన ప్రతి పోలీసులో ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్, ఆడ్మిన్ ఆర్‌ఐ శేఖర్‌బాబు, ఎంటీవో ఆర్‌ఐ శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం విజయశంకర్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


logo