శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 10, 2020 , 12:05:16

అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలి

అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలి

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: వాహనదారులు డ్రైవింగ్ అప్రమత్తంగా చేయాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. అర్టీసీ బస్టాండ్ అవరణలో రోడ్డు భ ద్రతపై ఆటో డ్రైవర్లకు గురువారం అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు రో డ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయన్నారు. ఇందు లో ఎక్కవ శాతం యువకుల మృతి చెందుతున్నారనీ, చిన్న పొరపాటుతో కుటుంబాలు చిన్నా, భిన్నమవుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్ర మాదాలు మానవ తప్పిదాలతో ఎక్కవ శాతం జరుగుతుంటాయన్నారు. రోడ్డుపై వాహనలు నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం అన్నారు. మానసికం గా, శరీరకంగా బాగున్నప్పుడే విధులకు వాహనాలను నడపాలన సూచించారు. రోడ్డు ప్రమాదం ని మిషాల్లో జరుగుతుందనీ, అజాగ్రత్తగా వాహనలు నడుపవద్దని సూచించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యతన్నారు. ప్రమాదాల నివారణకు ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీ ఎస్పీ సత్యనారాయణ, ఎస్‌హెచ్‌వో మస్క రాజు, అసిస్టెంట్ డిపోమేనేజర్ దేవబాల, ఎస్‌ఐ మధూకర్, తదితరులున్నారు.


logo