సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 10, 2020 , 12:04:36

పల్లెల ప్రగతి బాట

పల్లెల ప్రగతి బాట

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. గురువారం ఎనిమిదో రోజూ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలతో భాగస్వాములై అభివృద్ధి పనులు చేపట్టారు. పెంచికల్‌పేట్ మండలం చేడ్వాయి, బెజ్జూర్ మండలం ఊట్సారంగపల్లిలో జాయింట్ కలెక్టర్ రాంబాబు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలనీ, ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలకు అవార్డుల అందేలా చూస్తానని పేర్కొన్నారు. తిర్యాణి మండలం మాణిక్యాపూర్, రోంపల్లిలో రాష్ట్ర పల్లె ప్రగతి కార్యక్రమ పరిశీలకుడు పీవీ రాజారావు వాడ వాడలా కలియదిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. జైనూర్ మండలం జామ్ని, పొచ్చంలోద్దిలో పాల్గొన్న జడ్పీ సీఈవో వేణు పాల్గొన్నారు.

జిల్లాలో పల్లెప్రగతి కొనసాగుతున్నది. గురువారం ఎనిమిదో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జేసీ రాంబాబు బెజ్జుర్ మండలం ఊట్సారంగాపల్లిలో, పెంచికల్‌పేట్ మండలం చెడ్వాయిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు వెంటనే పూర్తి చేసి పంచాయతీని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. జడ్పీ సీఈవో వేణు జైనూర్ మండలం పొచ్చంలొద్దిలో జరగుతున్న శ్మశానవాటిక పనులు పరిశీలించారు. వాంకిడిలో జడ్పీటీసీ అజయ్ కుమార్ , రెబ్బెన మండలంలో జడ్పీటీసీ సంతోష్, ఎంపీపీ సౌందర్య మా దావాయిగూడలో డంపింగ్ యార్డు, నర్సరీ పనులను ప్రారంభించారు. ఆసిఫాబాద్ మండలంలోని కౌటగూడలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ ప ర్యటించారు. దహెగాం, కాగజ్‌నగర్, లింగాపూర్, సిర్పూర్ మండలాల్లో సర్పంచులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే తిర్యాణి మండలంలోని మాణిక్యాపూర్, రోంపల్లి శ్మశానవాటిక, డంపింగ్‌యాడ్, ఇతర అభివృద్ధి పనులను పల్లెప్రగతి పరిశీలకుడు పీవీ రాజారావు పరిశీలించారు.


logo