బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 09, 2020 , 13:17:38

పల్లెల్లో స్వచ్ఛబాట

పల్లెల్లో స్వచ్ఛబాట

-కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
-రెబ్బెన మండలం కిష్టాపూర్‌, నంబాలలో పర్యటన

రెబ్బెన: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నంబాల, కిష్టాపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నంబాలలో సర్పంచ్‌ చెన్న సోమశేఖర్‌ కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని కాలనీల్లో తిరిగి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ చెన్న సోమశేఖర్‌ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. కిష్టాపూర్‌లో ఆయన నర్సరీని పరిశీలించి పనులు సక్రమంగా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధింత సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను భాగస్వాములు చేస్తేనే గ్రామాలు త్వరతగతిన అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో రెబ్బెన మండల ప్రత్యేకాధికారి కృష్ణయ్య, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, తాసిల్దార్‌ రియాజ్‌ అలీ, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్‌, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, ఎంపీటీసీలు సంఘం శ్రీనివాస్‌, రాము, సర్పంచులు దాగం జమున పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలోని ఖనర్‌గాం, వాంకిడి గ్రామాల్లో రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. వాంకిడి గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జుగూడలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ పవన్‌సాయి, వార్డు సభ్యులతో కలిసి శ్మాశనవాటిక వెళ్లే ప్రధాన రోడ్డుపై పిచ్చిమొక్కలు జేసీబీతో తొలగించారు. ఖనర్‌గాంలో సర్పంచ్‌ సుగంద, తాసిల్దార్‌ రాంమోహన్‌రావు, గ్రామ కార్యదర్శి చంద్రమోహన్‌గౌడ్‌, గ్రామస్తులతో కలిసి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించారు. అలాగే హరితహారం మొక్కలకు నీరు పోశారు.
జైనూర్‌: మండలంలోని దుబ్బగూడ గ్రామ శివారులో సర్పంచ్‌ మడావి భీంరావ్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. గౌరి గ్రామంలో నర్సరీ నిర్మాణ పనులను సర్పంచ్‌ భీంరావ్‌, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి ఖలీల్‌లు పరిశీలించారు.

ప్రతి పల్లె అభివృద్ధి చెందాలి
ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని రాష్ట్ర పరిశీలకుడు వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం మోతుగూడ గ్రామంలో జరుగుతున్న రెండో విడుత పల్లెప్రగతిని ఆయన పరిశీలించారు. మోతుగూడ పంచాయతీకి ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌ ట్రాక్టర్‌ను సర్పంచ్‌ సువర్ణకు అందజేశారు. ఈదులావాడలో సర్పంచ్‌ భీమేశ్‌ ఆధ్వర్యంలో డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు, పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌కుమార్‌, మండల పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌, ఏపీవో చంద్రశేఖర్‌, సువర్ణ పాల్గొన్నారు.
రెబ్బెన: మండలంలోని కొమురవెల్లి గ్రామంలో నర్సరీ నిర్మాణ పనులను సర్పంచ్‌ మామిడి తిరుమల్‌ ప్రారంభించారు. గ్రామంలోని రహదారులకు ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించారు. గంగాపూర్‌, రెబ్బెన, గోలేటి, పులికుంట గ్రామాల్లో సైడ్‌డ్రైనేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో సర్పంచులు పందిర్ల వినోద, పోటు సుమలత, బొమ్మినేని అహల్యాదేవి, బుర్స పోషమల్లు, పంచాయతీ కార్యదర్శులు శంకర్‌, వంశీకృష్ణ, రవీందర్‌, కారోబార్లు సుధాకర్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు. అలాగే మండలంలోని వంకులం, నవేగాం గ్రామాల్లో జరుగుతున్న ప్రగతి పనులను స్పెషల్‌ స్కాడ్‌ వెంకటేశ్వరరావు పరిశీలించారు. డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, నర్సరీలను, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ వైర్లు, విధి ధీపాలు సక్రమంగా ఏర్పాటు చేశారో లేదో పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేయడంపై ఆరా తీశారు. నవేగాంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీకి కేటాయించిన అధికారి పనితీరు మార్చుకొని గ్రామం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పంచాయతీల్లో అమలైన 30 రోజుల ప్రణాళిక, పల్లెప్రగతి కార్యక్రమాలపై సర్కారుకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఆయన వెంట లైజన్‌ అధికారి ఫణికుమార్‌, మండల పంచాయతీ అధికారి అంజాద్‌పాషా, ఈజీఎస్‌ ఏపీవో కల్పన, సర్పంచులు జాదవ్‌ లలిత, వడై మాధవి ఉన్నారు.


logo