e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం

జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం

జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం

ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌
మంచిర్యాలలో స్థాయీ సంఘాల సమావేశం
జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి,ఎమ్మెల్యే చిన్నయ్య హాజరు

హాజీపూర్‌, జూలై 19 : జిల్లా అభివృద్ధికి పాటుపడుదామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ అన్నారు. జిల్లాప్రజా పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సో మవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘాల సమావేశానికి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో కొందరు నర్సులు కొవిడ్‌ బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకవచ్చారు. అలాగే జిల్లాకేంద్రంలోని కొన్ని ప్రైవేట్‌ దవాఖానలు కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వారికి అర్హతలున్నాయా ..? లేదా .? అని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించేలా చూడాలన్నారు. సిరంజిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ముందుగానే సిద్ధం చేసి ఉంచడంతో ఇంజక్షన్‌ ఇస్తున్నారా..? లేదా..? అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై అధికారులు పర్యవేక్షించాలని కోరారు.

అలాగే త మకు తెలియకుండానే గ్రామాలో అబివృద్ధి పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి మండలానికి చెందిన ఒకరు తప్పుడు వివరాలతో రైతుబీమా పొందారని, గతంలో అతనిపై కేసు నమోదు చేశారని, కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని జిల్లా వ్యవసాయ అధికారిని లక్షెట్టిపేట జడ్పీటీసీ ప్రశ్నించారు. జన్నా రం మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తున్నారని, అంతేగాకుండా పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని జన్నారం జడ్పీటీసీ జడ్పీ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో నాలుగో విడత పల్లె ప్రగతిలో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని డీపీవో తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్థాయీ సంఘాలకు అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి ఉద్యోగులను పంపడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు హాజరైతేనే పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు.

- Advertisement -

వచ్చే జడ్పీ సమావేశానికి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొటోకాల్‌ ప్రకారం అభివృద్ధి పనుల విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క రోనా వైరస్‌ నియంత్రణలో వైద్యశాఖ అధికారులు, సి బ్బం ది సేవలు అభినందనీయమన్నారు. బెల్లంపల్లి ఐసొలేషన్‌ నర్సుల పనితీరు మంచిగా ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఆధ్వర్వంలో జరిగిన స మావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, జడ్పీ ఉపాధ్యక్షుడు సత్యనారాయ ణ, జడ్పీసీఈవో నరేందర్‌, జ డ్పీటీసీలు, కా ర్యాలయ సూపరిండెంట్‌లు సత్యనారాయ ణ, శ్రీనివా స్‌, పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం
జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం
జిల్లా అభివృద్ధికి పాటుపడుదాం

ట్రెండింగ్‌

Advertisement