e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆదిలాబాద్ హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో గుర్తింపు
పోలీసుల పనితీరుతో రాష్ట్రంలో క్రైమ్‌ రేటు తగ్గింది
రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా
నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో మొక్క నాటిన అధికారి
ఆసిఫాబాద్‌లో డీపీవో భవన నిర్మాణం పరిశీలన

సీసీసీ నస్పూర్‌, జూలై 16 : హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా అన్నారు. సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. వనాల పెంపే లక్ష్యంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. పోలీసుల పనితీరుతో రాష్ట్రంలో క్రైమ్‌ రేటు తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌, సీఐలు కుమారస్వామి, నారాయణ నాయక్‌, ముత్తి లింగయ్య, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, అదనపు ఎస్‌ఐ ఇమామొద్దీన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌, కమిషనర్‌ తుంగపిండి రాజలింగు, కౌన్సిలర్లు బండి పద్మ, కుర్మిళ్ల అన్నపూర్ణ, పంబాల గం గా, బెడికె లక్ష్మి, అగల్‌డ్యూటీ రాజు పాల్గొన్నారు.
మన పోలీసు వ్యవస్థే నంబర్‌వన్‌
ఆసిఫాబాద్‌ అంబేద్కర్‌చౌక్‌, జూలై 16 : మన పోలీసు వ్యవస్థ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామెదర్‌ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయ పనులను రామగుండం సీపీ సత్యనారాయణ, ఎస్పీ సుధీంద్రతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని హంగులతో భవనాన్ని నిర్మిస్తున్నదని, పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కోలేటి దామోదర్‌ను ఆసిఫాబాద్‌ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గాదెవేణి మల్లేశ్‌ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమం లో డైరెక్టర్లు ఆశన్న, శంకర్‌ , ఏఎంసీ డైరెక్టర్‌ శ్యాంరావు , ఆత్మచైర్మన్‌ రమేశ్‌, రవీందర్‌, గోపాల్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

ట్రెండింగ్‌

Advertisement