e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home కొమరంభీం ఆదివాసులకు అండగా ఉంటాం

ఆదివాసులకు అండగా ఉంటాం

ఆదివాసులకు అండగా ఉంటాం

అడవిబిడ్డల అభివృద్ధికే రహదారి నిర్మాణం
రామగుండం సీపీ వీ సత్యనారాయణ
చోర్‌పల్లిలో రోడ్డు ప్రారంభం

లింగాపూర్‌, జూన్‌ 16 : ఆదివాసులకు అం డగా ఉంటామని, వారి అభివృద్ధి కోసమే రహదారి నిర్మించామని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. మండలంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన చోర్‌పల్లి, లేండిగూడ గ్రామాలకు ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రహదారిని చోర్‌పల్లిలో ఎస్పీ సుధీం ద్ర, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సభలో సీపీ మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పిస్తే కష్టకాలంలో ఎక్కడికైనా వెళ్లే వీలుంటుందన్నారు. చోర్‌పల్లి నుంచి లేండిగూడ, చోర్‌పల్లి నుంచి భీమన్‌గొందికి వేర్వేరు ర హదారులు నిర్మించడంపై స్థానిక పోలీసులను ఆయన అభినందించారు. యువకులు చదువుల్లో రాణించి, ఉద్యోగాలు సాధించాలని కోరారు. రైతులు స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోం చేసుకొని వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి సాధించాలని కోరారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి, యువతకు ఉపయోగపడే మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం యువకులకు వాలీబాల్‌ కిట్లను అం దజేశారు. అంతకుముందు ఆదివాసులు కమిషనర్‌కు ఘనస్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. తమ కు రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకున్న పోలీసులకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట మంచిర్యాల డీఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సీఐ హనోక్‌, ఎస్‌ఐలు మధూకర్‌, రమేశ్‌, సర్పం చ్‌ మర్సుకొల మనోహర్‌, పటేల్‌ ఆనంద్‌రావ్‌, శేశ్‌నారాయణ, జ్యోతిరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆదివాసులకు అండగా ఉంటాం
ఆదివాసులకు అండగా ఉంటాం
ఆదివాసులకు అండగా ఉంటాం

ట్రెండింగ్‌

Advertisement