e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home కొమరంభీం భళా.. బాలామృతం..

భళా.. బాలామృతం..

పిల్లల్లో ఎత్తు, ఎదుగుదల, బరువు లోపాల నివారణ
విటమిన్లు, ఖనిజాలతో బలవర్ధకం
పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు
ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు

మంచిర్యాల, సెప్టెంబర్‌ 15, నమస్తే తెలంగాణ :మన బాలామృతాన్ని పార్లమెంటరీ కమిటీ మెచ్చుకున్నది. చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లతో పాటు బాలామృతం తదితర పోషకాహారాన్ని అందిస్తున్నది. దీనివల్ల చిన్నారుల్లో ఎత్తు, ఎదుగుదల, బరువు లోపాల నివారణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తుండగా, బాలా మృతం పౌష్టికాహార లోపాలను నివారిస్తున్నది. వయస్సుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువుతో రేపటి తరం ఆరోగ్యవంతంగా తయారవుతున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మహిళా సాధికారత భేష్‌ అంటూ పార్లమెంటరీ కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌తోపాటు బాలామృతం అద్భుతం అంటూ కొనియాడింది.

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు, మూడు నుంచి ఆరేండ్ల పిల్లల ఆరో గ్య పరిరక్షణకు బాలామృతం అందిస్తున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం కొంతమేర మెరుగుపడుతున్నది. ఆశించిన స్థా యిలో ఫలితాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను కూడా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా పరిధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఐసీడీఎస్‌ ద్వారా 18 మండలాల్లో సేవలందిస్తున్నారు. మొత్తం 958 అంగన్‌వాడీ, 73 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 950 మంది అంగన్‌వాడీ, 69 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు, 885 మంది ఆయాలు, హెల్పర్లు పనిచేస్తున్నారు.

- Advertisement -

పోషకాహార లోపాల నివారణ..
జాతీయపోషకాహార సంస్థ సాంకేతిక సహకారంతో ఐసీడీఎస్‌ వారు బాలామృతం ద్వారా చిన్నారులకు బలవర్ధకమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రోత్‌ మానిటరింగ్‌ రిపోర్టు దీన్ని ధ్రువపరుస్తున్నది. ఇందులో బాలబాలికలు భేష్‌ అని తేలింది. మహిళా సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చ ర్యలు, సంక్షేమ పథకాలను రెండు రోజుల క్రితం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా ప్రశంసించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 0-5 ఏండ్ల చిన్నారుల్లో ఎంతమంది వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారనే వివరాలను సేకరించింది. జిల్లా ల వారీగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో ఆయా కేంద్రాల్లోని పిల్లల వయస్సు, వారి బరువు, ఎత్తు సహా ఆరోగ్య స్థితిగతుల్ని పరీక్షించింది. ప్రతి చిన్నారికీ ప్రత్యేకంగా ఆరోగ్య పర్యవేక్షణ కార్డును సైతం అందజేసింది.

ఉపయోగించిన పదార్థాలు..
7 నెలల నుంచి 3 ఏళ్ల మధ్య పిల్లలకు అవసరమైన పోషకాహారం అందించేందుకు ఐసీడీఎస్‌ కింద ప్రవేశపెట్టిన తల్లిపాలే ‘బాలామృతం’. వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపప్పు పిండి, చక్కెర, పాలపొడి, పిల్లలకు అవసరమైన ఇను ము, క్యాల్షియం, విటమిన్లు, విటమిన్‌ ఖనిజ లవణాలతో కూ డిన ఆహారం అందిస్తారు. 100 గ్రాముల పరిమాణంలో, ప్రతి రోజూ 3-5 సార్లు పిల్లలకు ఇస్తుంటారు. ఏడాదిలోపు పిల్లలకు బాలామృతం వేడి నీటిలో కలిపిన గంజిగా, పెద్ద పిల్లలకు దీనిని ‘లడ్డు’ రూపంలో అందించవచ్చు. బాలామృతాన్ని ప్ర తి బిడ్డకు నెలకు 2.5 కిలోల ప్యాకెట్లలో పంపిణీ చేస్తారు. ఇది ప్రతి నెలా మొదటి రోజు న్యూట్రిషన్‌ హెల్త్‌ డే 1న, 7 నెలల తల్లులకు, 3 ఏళ్ల పిల్లలకు టేక్‌ హోం రేషన్‌గా పంపిణీ చేస్తారు.

30 రోజుల్లో ఉపయోగించాలి
బాలామృతం ప్యాకెట్‌ విప్పిన 30 రోజుల్లో ఉపయోగించాలి. గాలి, తేమ తగలకుండా డబ్బాలో నిల్వ చేయాలి. పొడి ప్రదేశంలో నిలువ ఉంచాలి. క్రిమికీటకాలు, ఎలుకల బారిన పడకుండా భద్రపరుచుకోవాలి.

  • మాస ఉమాదేవి, జిల్లా సంక్షేమాధికారి, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మంచిర్యాల
    అనుబంధ పోషకాహారం..
    బాలామృతం అనేది పిల్లల 7 నెలల నుంచి 3 సంవత్సరాల కాలంలో సమర్థవంతమైన అనుబంధ పోషకాహారంగా ఉపయోగపడుతుంది. దీనిని ఒక పాలిచ్చే ఆహారంగా మాత్రమే కాకుం డా, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కేలరీల దట్టమైన ఆహారంగా కూడా వాడుతుంటారు.
  • గట్టు సరిత, అంగన్‌వాడీ టీచర్‌, చెన్నూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana