మంచిర్యాల, నమస్తే తెలంగాణ/మంచిర్యాల ఏసీసీ/లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 13;అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోటకు చేర్చి ఆడి పాడగా, పట్టణాలు మార్మోగాయి. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆడబిడ్డలతో కలిసి కోలాటం ఆడారు. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయ ఆవరణలో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొని తిలకించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లలో పెట్టి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తించారు. అనంతరం బతుకమ్మలను వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మహిళలతో కలిసి కోలాటం ఆడారు. మంచిర్యాలలోని హైటెక్ సిటీ, విశ్వనాథ ఆలయం, తెలంగాణ విగ్రహం, వికాస్‌నగర్, పట్టణంలోని పలు వీధుల్లో మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు.
పాత మంచిర్యాలలోని రాళ్లవాగు, జన్మభూమినగర్లోని రాముని చెరువు, పరిసర ప్రాంతాల్లోని కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. జిల్లాకేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఆలయ ఈవో ముక్త రవి, ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ మహిళాధ్యక్షురాలు గరిగంటి సరోజ, కౌన్సిలర్లు గాద సత్యం, మాదం శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ విగ్రహం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రాళ్లవాగు వద్ద బతుకమ్మ వేడుకలను ఏసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. లక్షెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మి వాడ, వడ్లవాడ, శివాలయం, హనుమాన్ టెంపుల్, కోర్టు ఏరియాల్లో మహిళలంతా బతుకమ్మ ఆడారు. సీఐ కరీముల్లాఖాన్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లు పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర మహిళా ఉద్యోగులు, పోలీస్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.