శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 15, 2020 , 00:01:25

124 మున్సి‘పోల్స్‌'బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య

124 మున్సి‘పోల్స్‌'బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య

మున్సిపల్‌ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం ముగిసింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో నిలచేదెవరో తేలింది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తంగా 186 నామినేషన్లు రాగా, ఇందులో 62 మంది విత్‌డ్రా చేసుకున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. దీంతో 124 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, నేటి నుంచి వాడవాడలా ప్రచారం హోరెత్తనున్నది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు బీ ఫాంలు అందజేసి, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 22న జరుగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తుండగా, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి.

కాగజ్‌నగర్‌ టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో 124 మంది అభ్యర్థులు నిలిచారు. మంగళవారం చివరిరోజు నామినేషన్ల విత్‌డ్రా సమయం ముగిసిన తరువాత మున్సిపల్‌ కమిషనర్‌ బీ తిరుపతి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఈ నెల 22న నిర్వహించనుండగా, 8 నుంచి 10వ తేదీ వరకు నామనేషన్లు స్వీకరించారు. దీంతో 30 వార్డులకు మొత్తంగా 186 నామినేషన్లు దాఖలయ్యాయి. 11న పరిశీలన పూర్తవడంతో, ఉపసంహరణకు మూడు రోజులు గడువు ఇచ్చారు. మంగళవారంతో గడువు ముగియగా, మొత్తం 62 నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఇందులో మొదటి రోజు ఆదివారం ఒకటి, సోమవారం ఏడు, మంగళవారం 58 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు 124 మంది బరిలో నిలిచారు. పోటీలో ఉన్నవారు టీఆర్‌ఎస్‌ 30 , కాంగ్రెస్‌ 29, బీజేపీ30, టీడీపీ 4, ఎంఐఎం4, సీపీఎం 1, ఉండగా 27 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్రులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు మున్సిపల్‌ కార్యాలయంలో గుర్తులను పరిశీలించుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగిన రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ముఖ్య నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. 


logo