e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home ఆదిలాబాద్ సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి
జైనూర్‌లో పర్యటన

జైనూర్‌, జూలై 11 : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. మండలకేంద్రం లో ఆదివారం పర్యటించారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. కాశీపటేల్‌గూడలో నీటిసమస్య ఉందని కాలనీవాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీం తో ఆమె స్పందిస్తూ ఇటీవల బోరు వేయించామని, వారంలోగా మోటారు బిగించి నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్‌, మొమిన్‌పూర, గణేశ్‌నగర్‌, శివాజీనగర్‌ కాలనీల్లో సైడ్‌డ్రైన్‌, అంతర్గత రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీనిచ్చా రు. డ్రైనేజీల నుంచి మిషన్‌ భగీరథ పైపులు అ మర్చి ఉండడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం తో పాటు గౌరి, పాట్నాపూర్‌, తదితర గ్రా మా ల్లో నీటి సమస్య ఉందని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లా లా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యా దవ్‌రావ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతాలిబ్‌, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్‌ ఎంపీపీ చీర్లె లక్ష్మణ్‌, సహకార సంఘం చైర్మన్‌ కోడప హన్నుపటేల్‌, సీనియర్‌ నాయకుడు మె స్రం అంబాజీ, సర్పంచ్‌లు మడావి భీంరావ్‌, పార్వతీలక్ష్మణ్‌, గోవింద్‌రావ్‌, ఎంపీటీసీ కుమ్ర భగవంత్‌రావ్‌, ఆత్రం జుగాదిరావ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సిర్పూర్‌-(యూ) మండలాధ్యక్షుడు తొడసం ధర్మారావ్‌, నాయకులు షేక్‌ అబ్బు, కిరణ్‌ తదితరులు ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి
రెబ్బెన, జూలై 11 : హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నా రు. మండలంలోని గోలేటి గ్రామంలో ఆదివా రం మొక్క నాటి నీరు పోశారు. అదేవిధంగా గంగాపూర్‌ శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఎస్‌ఐ భవానీసేన్‌ మొక్క నాటారు. కార్యక్రమంలో గోలేటి సర్పంచ్‌ పో టు సుమలత, ఏఎంసీ చైర్‌పర్సన్‌ పర్లపల్లి వన జ, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వే ముర్ల సంతోష్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బొదాసు దేవానంద్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, ఆలయ చైర్మన్‌ వోల్వోజి వెంకటేశంచారి, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు, వార్డు సభ్యులు రవినాయక్‌, వెంకట్రావ్‌, సీనియర్‌ నాయకుడు జుమ్మిడి ఆనందరావు, ఆల య కమిటీ డైరెక్టర్లు, పాల్గొన్నారు.
జీ మార్టు ప్రారంభం..
గోలేటి గ్రామంలో జీ మార్డు షాపును జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆర్టీవో శ్యాంనాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేడీ పౌడేల్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, నా యకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

ఆ రెండు కోరిక‌లు తీర‌కుండానే మ‌ర‌ణించిన క‌త్తి మ‌హేశ్‌

రేపు భ‌క్తులు లేకుండానే జ‌గన్నాథ‌ ర‌థ‌యాత్ర‌

జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యల పరిష్కారానికి కృషి

ట్రెండింగ్‌

Advertisement