గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 23:56:50

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
  • ఎలాంటి వదంతులను నమ్మొద్దు
  • కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పోలీస్‌ బలగాల కవాతు
  • పట్టణ ప్రజలకు ఎస్పీ మల్లారెడ్డి పిలుపు
  • ఇబ్బందులుంటే పోలీసులకు సమాచారమివ్వండి
  • ఎలాంటి వదంతులను నమ్మొద్దు
  • కాగజ్‌నగర్‌ పట్టణ ప్రజలకు ఎస్పీ మల్లారెడ్డి పిలుపు
  • ఇబ్బందులుంటే సమాచారమందించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల మీదుగా మంగళవారం పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 22న జరుగనున్న ఎన్నికల కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే ఈ కవాతు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. ఇబ్బందులుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.  ఈ కా ర్యక్రమంలో ఎస్‌హెచ్‌వో మోహన్‌ సీఐ నరేందర్‌, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు రవికుమార్‌, గంగన్న, తైజొద్దీన్‌, రాజ్‌కుమార్‌, లచ్చన్న పోలీసులు పాల్గొన్నారు. 


logo