బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 23:54:27

మొన్న నాలుగు..నిన్న మూడు

మొన్న నాలుగు..నిన్న మూడు
  • చెన్నూర్‌లో ఏకగ్రీవాల జోరు..
  • 18వార్డుల్లో ఏడు స్థానాలు కైవసం
  • మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ దూకుడు

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : చెన్నూర్‌ మున్సిపాలిటీలో వరుసగా ఏకగ్రీవాలతో టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. మొన్న(సోమవారం) నాలుగు స్థానాలు, నిన్న(మంగళవారం) మూడు స్థానాలు కలిపి మొత్తం ఏడు స్థానాలు కారు ఖాతాలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగియడంతో 18 వార్డులకు ఏడు వార్డుల్లో గులాబీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన పూర్తయినప్పటి నుంచి ఉపసంహరణ గడువు ముగిసే నాటికి పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక కొసాగింది. చెన్నూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 18వార్డలకు గాను ఈ రెండు రోజుల్లో ఏడు వార్డు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నాలుగు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం మరో మూడు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 2వ వార్డులో కమ్మల శ్రీనివాస్‌, 5వ వార్డులో నసీమా బేగం సయ్యద్‌, 18వ వార్డులో గర్రెపల్లి శాంతారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన మహ్మద్‌ తాజొద్దీన్‌, రాకేశ్‌గౌడ్‌, స్వతంత్ర అభ్యర్థి బొడ్డు గోపీకృష్ణ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమ్మల శ్రీనివాస్‌, 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిడం రోహిణి, స్వతంత్ర అభ్యర్థి సహిస్తా బేగం తమ నామినేష్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నసీమా బేగం, 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి తలత్‌ పర్వీన్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గర్రెపల్లి శాంతారాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


మిగితా వార్డుల్లో పలువురు అభ్యర్థుల ఉపసంహరణ

మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో 7వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగితా 11వార్డుల్లో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. 1వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీడమ్మీ అభ్యర్థి వీరమల్ల రాంమోహన్‌, స్వతంత్ర అభ్యర్థి జన్నం శ్రీకాంత్‌, 4వ వార్డులో సీపీఐ అభ్యర్థి తగరం మధూకర్‌, 7వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి పెద్దల రజిత, బీజేపీ డమ్మీ అభ్యర్థి సిడం రోహిణి, 8వ వార్డులో రాజేశ్‌కుమార్‌, 9వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మానికరౌతు శంకర్‌, 12వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తగరం లలిత, స్వతంత్ర అభ్యర్థి చిలుముల మధునమ్మ, 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు దూలం సత్యనారాయణ, పడాల రఘువీర్‌గౌడ్‌, నెన్నల వేణు, 17వ వార్డులో బీజేపీ పార్టీ డమ్మి అభ్యర్థి దంతవేణి విమల, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి స్వాతి గుజార్‌ తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.


logo
>>>>>>