పది రోజులపాటు సందడి సందడిగా సాగిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది. ‘ప్రగతి’ పనులతో పల్లె మెరిసిందని సర్పంచులు, ప్రజాప్రతినిధులు ముగింపు గ్రామసభలు, కార్యక్రమాల్లో సంతోషం వ్యక్తం చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ, ఏయే కార్యక్రమాలు జరిగాయో, ఎవరెవరు పాల్గొన్నారో చూద్దాం.
ఏన్కూరు మండలంలో..
ఏన్కూరు, జూలై 10: మండలంలోని తూతకలింగన్నపేటలో పారిశుధ్య కార్మికులను సర్పంచ్ బాణోతు వీరభధ్రం సన్మానించారు. ఉప సర్పంచ్ నమా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల మండలంలో..
కొణిజర్ల, జూలై 10: మండలవ్యాప్తంగా గ్రామసభలు జరిగాయి. చిన్నగోపతి, రాజ్యాతండాలో ప్రత్యేకాధికారి ఎ.పరంధామిరెడ్డి, ఎంపీడీవో ఆర్.రమాదేవి పర్యటించారు. సింగరాయపాలెం ప్రకృతి వనాన్ని సర్పంచ్ దొడ్డపునేని జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పరిశీలించారు.
కారేపల్లి మండలంలో..
కారేపల్లి, జూలై 10: మండలంలోని అప్పాయిగూడెం రైతు వేదిక భవనాన్ని అటవీశాఖ అధికారి శిరీష, మండల ప్రత్యేకాధికారి కె.అజయ్‌కుమార్, తహసీల్దార్ దొడ్డ పుల్లయ్య, ఎంపీడీశో మాచర్ల రమాదేవి పరిశీలించారు. సర్పంచ్ అజ్మీర అరుణ, పంచాయతీ ప్రత్యేకాధికారి పుష్పకుమారి, పంచాయతీ కార్యధర్శి నాగలక్ష్మి పాల్గొన్నారు.
కారేపల్లి రూరల్, జూలై 10: మండలంలోని భాగ్యనగర్‌తండా, పోలంపల్లి గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలను జిల్లా రెవెన్యూ అధికారి శిరీష పరిశీలించారు. భాగ్యనగర్‌తండాలో మొక్క నాటారు. భాగ్యనగర్‌తండా సర్పంచ్ సుజాతాభన్సీలాల్, పోలంపల్లి సర్పంచ్ గుగులోతు సక్రు నాయక్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి మండలంలో..
పెనుబల్లి, జూలై 10: మండలంలోని తాళ్ళపెంటలో హరితహారం మొక్కలకు ట్రీ గార్డులను సర్పంచ్ ఏర్పాటు చేయించారు.
సత్తుపల్లి మండలంలో..
సత్తుపల్లి, జూలై 10: మండలంలోని కొత్తూరులో గ్రామస్తులు మొక్కలు నాటారు. సర్పంచ్ ఒగ్గు విజయలక్ష్మీశ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి పురుషోత్తం పాల్గొన్నారు. మండలంలోని బేతుపల్లిలో శుక్రవారం రాత్రి ఎంపీపీ దొడ్డా హైమావతీశంకర్రావు పల్లె నిద్ర చేశారు. గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. సర్పంచ్ పాకలపాటి శ్రీనివాసరావు, ఎంపీవో కృష్ణ పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, జూలై 10: కిష్టారంలో జరిగిన గ్రామసభలో సర్పంచ్ చెట్టుమాల రేణుకాఈశ్వర్, పంచాయతీ స్పెషలాఫీసర్ ఏపీవో బాబూరావు, ఉప సర్పంచ్ కొలపనేని ధనుంజయ, ఎంపీటీసీ సభ్యురాలు పాలకుర్తి సునీతారాజు, కార్యదర్శి రవి పాల్గొన్నారు.
తల్లాడ మండలంలో..
తల్లాడ, జూలై 10: మండలంలోని బాలపేట గ్రామసభలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్ కోసూరి వెంకటనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు మండలంలో..
వేంసూరు, జూలై 10: మండలంలోని మర్లపాడు పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిని సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి సన్మానించారు. వెంకటాపురంలో ఇంటింటికి మొక్కలను ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఆనందయ్య ఆయుర్వేద మందును సర్పంచ్ వెంకటరెడ్డి అందజేశారు. ఎంపీవో రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైరా మండలంలో
వైరా, జూలై 10: మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో పారిశుధ్య పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రగతి పనుల్లో ఆదర్శంగా నిలిచిన 11 మంది మహిళలను సర్పంచ్ ఇటుకాల మురళి సన్మానించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీడీవో వెంకటపతిరాజు, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీవో జ్యోత్స్నాదేవి, పంచాయతీ ప్రత్యేకాధికారి వాసంతి, కార్యదర్శి అనూష పాల్గొన్నారు.