e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఖమ్మం ‘పీఆర్‌సీ’పై ఉద్యోగుల హర్షం

‘పీఆర్‌సీ’పై ఉద్యోగుల హర్షం

‘పీఆర్‌సీ’పై ఉద్యోగుల హర్షం

ఖమ్మం/ ఖమ్మం సిటీ/ ఖమ్మం ఎడ్యుకేషన్‌, మార్చి 28: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసంలో ఆయన్ను కలిసి పూలమొక్కలు అందించారు. శాలువాలతో సత్కరించారు. బాణాసంచా కాల్చి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. టీఎన్‌జీవో నాయకులు అప్జల్‌హసన్‌, టీజీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, ఉషశ్రీ, వేల్పుల విజేత, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కారుమంచి శ్రీనివాసరావు, తుంబూరు సునీల్‌రెడ్డి, నాగరాజు, రహీమ్‌, నరేశ్‌, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు పొట్టపెంజర రామయ్య, జిల్లా కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కొణిదెన శ్రీనివాస్‌, కొమరగిరి దుర్గాప్రసాద్‌, మెడికల్‌ ఫోరమ్స్‌ నుంచి తాళ్లూరి శ్రీకాంత్‌, ఐసీడీఎస్‌ నుంచి కత్తుల రవి, అగ్రికల్చర్‌ నుంచి కిషన్‌, గ్రంధాలయం నుంచి ఇమామ్‌, మార్కెటింగ్‌ నుంచి ఆంజనేయులు, పీఆర్‌ నుంచి వెంకటపతిరాజు, మల్లెల రవీంద్ర ప్రసాద్‌, వైద్య విధాన పరిషత్‌ నుంచి సాగర్‌, నందగిరి శ్రీను, మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం నుంచి శ్రీనివాస్‌, భద్రం, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఉద్యోగుల సంఘం నుంచి మజీద్‌, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నుంచి శ్రీనివాసరెడ్ది , శ్రీనివాస్‌, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నుంచి హకీమ్‌, టీమేసా నుంచి రజబ్‌అలీ, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ నుంచి శశిధర్‌ పాల్గొన్నారు.

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..
ఖమ్మం వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులు కూడా మంత్రి అజయ్‌కుమార్‌ను కలిశారు. పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ప్రకటన అనంతరం, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఖమ్మానికి చేరుకున్న మంత్రిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ శాఖాపరమైన కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన అజయ్‌.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు.

సీపీఎస్‌ ఉద్యోగుల కృతజ్ఞతలు..
సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ ప్రకటించినందుకు తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌) ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్‌, సీపీఎస్‌ బాధ్యులు శ్రీనివాసరెడ్డి, లోకేశ్‌కుమార్‌, శంకర్‌, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, విజయ్‌కుమార్‌, శివప్రసాద్‌, పండు, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఇవీ కూడా చదవండి..

మన గెలుపే బీజేపీకి జవాబు

ఎయిర్‌క్రాఫ్ట్ టాయిలెట్‌లో 3 కేజీల బంగారం

డబుల్‌ డెక్కర్‌ బస్సులకు అశోక్‌ లేలాండ్‌ టెండర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘పీఆర్‌సీ’పై ఉద్యోగుల హర్షం

ట్రెండింగ్‌

Advertisement