e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఖమ్మం అభివృద్ధి, సంక్షేమంలో.. తెలంగాణ అగ్రగామి

అభివృద్ధి, సంక్షేమంలో.. తెలంగాణ అగ్రగామి

  • అట్టడుగు వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు
  • ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
  • నగరంలో ఫిట్‌ ఇండియా ఫ్రీడం రన్‌
  • సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఖమ్మం సిటీ, సెప్టెంబర్‌ 18: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం నగరంలో ఫ్రీడం రన్‌ నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశానుసారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ‘ఫిట్‌ ఇండియా ఫ్రీడం రన్‌’కు ఎంపీ నామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం 6:30 గంటలకు నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి లకారం ట్యాంక్‌బండ్‌ వరకు అత్యంత కోలాహలంగా పరుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం వల్ల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. ఈ ఫలాలను అధికారులు అట్టడుగు వర్గాలకు అందించాలని కోరారు. మేయర్‌ నీరజ, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు, డీవైఎస్‌వో పరంధామరెడ్డి, నెహ్రూ యువ కేంద్రం అధికారి అన్వేష్‌, క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఫ్రీడం రన్‌లో పాల్గొన్న వారందరితో ఎంపీ నామా జాతీయ సమైక్యతా భావన ప్రతిజ్ఞ చేయించారు.

పేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

- Advertisement -

మామిళ్లగూడెం/ వైరా, సెప్టెంబర్‌ 18: అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో వైరా నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.10 లక్షల విలువ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శనివారం సాయంత్రం ఆయన పంపిణీ చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మునిపల్‌ చైర్మన్‌ జయపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, వివిధ మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement