e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఖమ్మం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ సత్తుపల్లి

అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ సత్తుపల్లి

అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ సత్తుపల్లి

మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.32.93 కోట్లతో అభివృద్ధి పనులు
రూ.3 కోట్లతో మున్సిపల్‌ కార్యాలయ భవనం సిద్ధం
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 1: రాష్ట్రంలోనే రాజకీయంగా చరిత్ర కలిగిన సత్తుపల్లి ప్రాంతం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆయన గురువారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ర్టానికే ఆదర్శంగా సత్తుపల్లి నిలిచిందని అన్నారు. ఇంతటి అభివృద్ధి వెనుక ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ సహకారం ఎంతో ఉందని చెప్పారు. కేటీఆర్‌ మంజూరు చేసిన రూ.32.93 కోట్లతో సత్తుపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. సత్తుపల్లిలోని మూడెకరాల స్థలంలో 140కి పైగా షాపులతో వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు మంత్రులు శుక్రవారం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మంజూరైన 72 అభివృద్ధి పనుల్లో 42 పూర్తయినట్లు తెలిపారు. పారిశుధ్యం, సీసీ రోడ్లు, స్వీపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.3.11కోట్లతో అధునాతన హంగులతో కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఆటోనగర్‌, క్రైస్తవ భవన్‌, షాదీఖానా నిర్మాణానికి నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు చెప్పారు.
మంత్రుల పర్యటనను జయప్రదం చేయాలి
సత్తుపల్లిలో శుక్రవారం మంత్రుల పర్యటనను నాయకులు జయప్రదం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటిస్తారని చెప్పారు. పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభిస్తారని, వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారని, దోబీఘాట్‌ సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ఆ తరువాత మున్సిపల్‌ కార్యాలయం కొత్త భవనం వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని వివరించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, కమిషనర్‌ సుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, దొడ్డా శంకర్‌రావు, మల్లూరు అంకమరాజు, కంచర్ల నాగేశ్వరరావు, ఏగోటి పెద్దిరాజు, టోపీ శ్రీను, పవన్‌, పాలకుర్తి రాజు, అమరవరపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ సత్తుపల్లి

ట్రెండింగ్‌

Advertisement