ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు సెప్టెంబర్ 18న ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరాం గురువారం తెలిపారు. ప్రముఖ ఇన్సురెన్స్ కంపెనీలలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఖమ్మంలో పనిచేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. డిగ్రీ చదివి, వయస్సు 30 ఏండ్లుపైన ఉన్నవారు మాత్రమే అర్హులని అన్నారు. బయోడేటాతో ఇంటర్వ్యూ కు హాజరుకావాలని కోరారు.మరిన్ని వివరాలకు 8247656356 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.