e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు

ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు

ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు

ఖ‌మ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు క‌నీస అవ‌స‌రాల‌కు ఇబ్బందులు ఎదుర్కొంది. స‌మ‌స్య‌లు తీరే దారి లేద‌ని ఆశ‌లు వ‌దులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క‌నీస‌ సౌకర్యాలు నోచుకోని గ్రామం చిన్న బీర‌వ‌ల్లి. భూగర్భజల మట్టాలు క్షీణించడం వల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బోరింగ్‌ల్లో 40 శాతానికి పైగా ఎండిపోయాయి. ఇటువంటి గ్రామాల్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో ఇవన్నీ ఒక‌ప్ప‌టి కథలుగా మారాయి.

ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమం గ్రామ రూపాన్నే మార్చివేసింది. ఇప్పుడు, ఇక్కడ సౌకర్యాలు లేమి అనేది గ‌త కాల‌పు మాట‌లు. ప్ర‌భుత్వం మంజూరు చేసిన నిధులను సమస్యలను అధిగమించడానికి, గ్రామాన్ని సుందరీకరించడానికి చాలా బాగా ఉపయోగించారు. ఈ గ్రామం ఇప్పుడు పచ్చదనం ప‌రుచుకుని ఆహ్లాదకరమైన వాతావర‌ణాన్ని సంత‌రించుకుంది.

- Advertisement -

రాళ్లు ర‌ప్ప‌ల‌తో కూడిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.12 ల‌క్ష‌ల వ్య‌యంతో అభివృద్ధి చేశారు. ఈ మూడు ఎకరాల భూమిలో రూ. 36 ల‌క్ష‌ల వ్యయంతో రైతులు కూర్చుని మాట్లాడటానికి, త‌మ ఆలోచనలు, అనుభవాలను పంచుకోవ‌డానికి రైతు వేదిక నిర్మాణం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్ నిర్మించబడ్డాయి. మ‌రో 25 సెంట్ల‌లో హరితా హరం కోసం న‌ర్స‌రీ ఏర్పాటు చేశారు. ఇందులో 16 వేల మొక్కల పెంపకాన్ని చేప‌ట్టారు. ఈ న‌ర్స‌రీ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎస్‌బీఎఫ్ నిధుల‌తో మూడు సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, మూడు కల్వర్టులను నిర్మించారు. జిల్లా పరిషత్ మంజూరు చేసిన రూ .4 లక్షలను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించారు.

గ్రామ సర్పంచ్ తేర‌బ‌త్తిని శాంత‌య్య మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం త‌మ గ్రామ రూపురేక‌ల‌ను మార్చివేసింద‌న్నారు. గ్రామానికి అవసరమైన నిధుల మంజూరుతో గ్రామీణాభివృద్ధికి మార్గం సుగమం అయింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గ్రామాల‌కు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా ఇది సాధ్యమైంద‌న్నారు. ప్రతి రూపాయి గ్రామీణాభివృద్ధికి ఉప‌యోగించిన‌ట్లు తెలిపారు. ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఇంటికి నీటి సరఫరా ఉందన్నారు. ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేప‌ట్టాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కార‌మై గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపడ్డాయ‌ని చెప్పవచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు
ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు
ప‌ల్లె ప్ర‌గ‌తితో ఓ చిన్న కుగ్రామం ఆద‌ర్శ గ్రామంగా మారిన తీరు

ట్రెండింగ్‌

Advertisement