e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News ఖ‌మ్మంలో రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌.. ఆరోగ్య సిబ్బంది తొల‌గింపు

ఖ‌మ్మంలో రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌.. ఆరోగ్య సిబ్బంది తొల‌గింపు

ఖ‌మ్మంలో రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌.. ఆరోగ్య సిబ్బంది తొల‌గింపు

ఖ‌మ్మం : రెమ్‌డెసివిర్ వ‌య‌ల్స్‌ను బ్లాక్ మార్కెటింగ్‌కు త‌ర‌లించిన ఘ‌ట‌న‌లో ఖ‌మ్మం జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న ఓ స్టాఫ్ న‌ర్సుతో పాటు ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ను క‌లెక్ట‌ర్ విధుల నుంచి తొల‌గించారు. ఈ ఘ‌ట‌న గురువారం చోటుచేసుకుంది. మందుల‌ను బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్ ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆస్ప‌త్రుల్లోని వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

వైద్యులు అప్ర‌మ‌త్తంగా ఉంటూ రోగుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మందులు, ఇంజెక్ష‌న్లు ఇవ్వాల‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌ను సూప‌రింటెండెంట్ ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ఆరు వ‌య‌ల్స్ రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ.38 వేల‌కు అమ్ముతుండ‌గా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్ట‌ర్ వేణు మాధ‌వ్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌తీష్ కుమార్ రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement