e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఖమ్మం Khammam | దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.30కోట్లు : జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్

Khammam | దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.30కోట్లు : జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్

చింతకాని: చింతకాని మండలంలోని దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.30కోట్లు కేటాయించారని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు లేదని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. చింతకాని రైతువేదికలో పలు గ్రామాలకు చెందిన 20మంది లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సిఫారసు మేరకు రూ.5లక్షల66వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు అమలు తెలంగాణ రాష్ట్రంలో జరగుతున్నదని, ప్రతి సంవత్సరం దళితుబంధు కోసం బడ్జెట్‌లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్‌ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతుసమన్వయసమితి సభ్యులు మంకెన రమేశ్, కిలారు మనోహర్, సోసైటీచైర్మన్ కోండపల్లి శేఖర్‌రెడ్డి, సర్పంచులు చాట్ల సురేశ్, బండి సుభద్ర, తిరుపతి కోండలరావు, కోరిపల్లి సునిత, నాయకులు వేముల నర్సయ్య, గడ్డం శ్రీనివాసరావు, బోడ్డు వెంకట్రామారావు, బోగ్గారపు రాంబాబు, ఆవుల నాగేశ్వరరావు, పిన్నెల్లి శ్రీను, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana