కొణిజర్ల మండలంలోని మేకాలకుంట, కారేపల్లి మల్లన్నగూడెం గ్రామాలు బోనమెత్తాయి.. భక్తిపారవశ్యంలో తేలియాడాయి.. గ్రామ దేవతలు, వన దేవతలకు ప్రణమిల్లాయి.. శ్రావణమాసం చివరి గురువారాన్ని పురస్కరించు కొని గ్రామస్తులు ముత్యాలమ్మ, సమ్మక్క సారక్కకు మొక్కులు తీర్చుకున్నారు.. పంటలు బాగా పండాలని పూజలు చేశారు.. డప్పు చప్పుళ్లు, మేళ తాళాల మధ్య గ్రామస్తులు నృత్యం చేయగా వారితో కలిసి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బానోత్ చంద్రావతి పాదం కలిపి సందడి చేశారు.. – కొణిజర్ల/ కారేపల్లి, ఆగస్టు 25