e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఖమ్మం 57 ఏళ్లు దాటిన వారికి త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు

57 ఏళ్లు దాటిన వారికి త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు

పెనుబల్లి, ఆగస్టు 1: తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అది దేశంలో నెంబర్‌ వన్‌ అవుతోందని, రాష్ట్రం కూడా నెంబర్‌ వన్‌గా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. మండలంలోని ఏరుగట్లలో ఆదివారం 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని పెట్టినా అది విజయవంతం అవుతోందని, దాని ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాలూ ప్రశంసిస్తున్నాయని గుర్తుచేశారు. రాజకీయ అవగాహన లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేలా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే 57 ఏళ్లు దాటిన వారికి త్వరలోనే ఆసరా పింఛన్ల అందించేందుకు కార్యాచరణ జరుగుతోందన్నారు.

జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్‌ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నీలాద్రి దేవాలయ ఛైర్మన్‌ పసుమర్తి వెంకటేశ్వరరావు, సీడీసీ ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ లక్కినేని శ్యామలాదేవి, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్‌ చింతనిప్పు సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సోమరాజు రామప్ప, సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ నాగరాజు, ఎంపీడీవో కావూరి మహలక్ష్మి, ఎంపీవో వాల్మీకి కిశోర్‌, ఏవో ప్రసాదరాజు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్‌, సర్పంచ్‌లు తడికమళ్ల మంగమ్మ, రాయపూడి మల్లయ్య, శంకర్‌, ఆళ్ల అప్పారావు, గోదా చెన్నారావు, టీఆర్‌ఎస్‌ కనగాల వెంకటరావు, నాయకులు చీకటి రామారావు, గువ్వల వెంకటరెడ్డి, లగడపాటి శ్రీను, భూక్యా ప్రసాద్‌, వంగా నిరంజన్‌గౌడ్‌, తడికమళ్ల తాతారావు, ఆవిటి మారేశ్వరరావు, నాగళ్ల నాగేశ్వరరావు, కోండ్రు శ్రీరాములు, పరిమి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana