శనివారం 06 మార్చి 2021
Khammam - Jan 27, 2021 , 02:18:28

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

  • అఖిలపక్షం ఆధ్వర్యంలో వినూత్న నిరసన

బోనకల్లు/కొణిజర్ల, జనవరి26 : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష నేతలు కళ్లకు గంతలు కట్టుకొని మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, తోట రామాంజనేయులు మాట్లాడుతూ.. 60 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రధాని మోదీకి కంటికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్‌అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ జెండా పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంగళ ఆనందరావు, దొండపాటి నాగేశ్వరరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, కంకనాల సౌభాగ్యం, జక్కా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

ట్రాక్టర్లతో రైతన్నల ర్యాలీ...

కొణిజర్ల మండలంలోని చిన్నమునగాలలో రైతులు ట్రాక్టర్లకు జాతీయ జెండాలు కట్టి ప్రదర్శన నిర్వహించారు. రైతుసంఘం అధ్యక్షుడు బొంతు రాంబాబు, కుటుంబరావు, నరసింహారావు, తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo