నిరుద్యోగులకు ప్రభుత్వ భరోసా

- టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే కందాళ
- ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: తాతా మధు
కూసుమంచి, జనవరి 26: టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని, దీంతో నిరుద్యోగులకు భరోసా లభిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్ట పడి పనిచేయాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో 12,378 ఓట్ల్లు ఉన్నాయని, వాటిని పోలింగ్ చేయించే వరకు విశ్రమించక పని చేయాలని కోరారు. ఫిబ్రవరి 1న జరిగే పాలేరు నియోజకవర్గ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆత్మ కమిటీ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సేట్రాంనాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, చాట్ల పరశురాం, ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బెల్లం ఉమ, బోడా మంగీలాల్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, జడ్పీటీసీలు యండపల్లి వరప్రసాద్, ఇంటూరి బేబీ, పీఏసీఎస్ చైర్మన్లు చావా వేణు, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, ఏనుగు ధర్మారెడ్డి, సర్పంచ్‌లు కాసాని సైదులు, మందడి పద్మా వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- ఇండియా విజ్ఞప్తికి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్