శనివారం 27 ఫిబ్రవరి 2021
Khammam - Jan 27, 2021 , 02:17:55

మత్స్యకారుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు

మత్స్యకారుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు

  • ఎమ్మెలే కందాళ ఉపేందర్‌రెడ్డి

కూసుమంచి, జనవరి 26 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి అన్నారు. పీవీ నర్సిహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రంలో 90 రోజులు శిక్షణ పొందుతున్న వనపర్తి జిల్లా పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు మంగళవారం శిక్షణ సర్టిఫికెట్లు అంజేశారు. సీనియర్‌ సైటిస్టు విద్యాసాగర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి బ్యాచ్‌ కావటం విద్యార్థులు అదృష్టవంతులన్నారు. పాలేరులో మత్స్య పరిశోధనా కేంద్రం, కేజ్‌ కల్చర్‌, వందలాది మంది మత్స్యకారులు, చేపల అమ్మకాలు, మార్కెటింగ్‌, చేపలు పట్టడంతోపాటు వ్యాధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహనతో కూడిన శిక్షణ తీసుకోవటం భవిష్యత్తులో మంచి వృత్తి నైపుణ్యానికి ఉపయోగ పడుతుందన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు. సైటిస్టు విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు 90రోజుల శిక్షణలో ఇచ్చిన వాటి వివరాలు తెలిపారు. భవిష్యత్తులో జనాభాకు తగ్గట్టుగా ఆహారోత్పత్తులు జరగాల్సి ఉందన్నారు. వాటికి అణుగుణంగా మత్స్య సంపద పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు సరిఫికెట్‌లు అంజేశారు. సైటిస్టులు శాంతన్న, నాగరాజు, నందినీ తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo