ప్రైవేట్ హెల్త్ వర్కర్లకు టీకాలు

- ఖమ్మంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మయూరిసెంటర్, జనవరి 25 : ఖమ్మంలోని మమత జనరల్ హాస్పిటల్, అంకుర హాస్పిటల్లో సోమవారం ప్రైవేటు హెల్త్వర్కర్లకు కరోనా వ్యాకినేషన్ కార్యక్రమం జరిగిం ది. వ్యాక్సినేషన్‌ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. వెయిటింగ్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాలతి నగరంలోని విశ్వాస్, క్యూర్, స్పర్శ వైద్యశాలల్లో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. 6,156 మంది ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్ కోసం ఎన్రోల్ చేసుకోగా 21 ప్రైవేట్ వైద్యశాలల్లో 730 మంది టీకా వేశామని, ప్రభుత్వ విభాగంలో జిల్లావ్యాప్తంగా మిగిలిన (మాప్ అప్ రౌండ్)1,672 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. కార్యక్రమాల్లో మమత వైద్య సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ భాగం కిషన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డీఐవో డాక్టర్ అలివేలు, వైద్యులు సుబ్బారావు, కోటిరత్నం, సైదులు, లక్ష్మీనారాయణ, ప్రవీణ, ప్రమీల తదితరులున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం, జనవరి 25: పాతకొత్తగూడెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సోమవారం ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు, సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వైద్యులు తొలిటీకాను డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబుకు వేశారు. టీకాపై ఎలాంటి అపోహలు వద్దని వైద్యులు ఈ సందర్భంగా సందేశమిచ్చారు. జిల్లావ్యాప్తంగా 656 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యులు వాణి, నిస్సీ షారోన్, పొన్నెకంటి సంజీవరాజు, ఏఎన్ఎంలు జయంతి, లలిత, కమల, అరుణ, నాగమణి, రమణ, ఎల్టీ నాగమణి, ఆశాలు ప్రమీల, శారద, సుజాత, సునీత, మసూద బేగం, సుదర్శన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- హిమాచల్‌లో మహమ్మారి కలకలం : మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్!
- జాన్వీకపూర్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
- రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల
- టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్‌లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
- బకాయిలు చెల్లించకున్నా కరెంటు కట్ చేయం : అజిత్ పవార్
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!