మంగళవారం 09 మార్చి 2021
Khammam - Jan 26, 2021 , 03:18:17

అత్యవసర సేవలకు ఆధునిక అంబులెన్స్‌లు

అత్యవసర సేవలకు ఆధునిక అంబులెన్స్‌లు

  • రూ.24లక్షలతో నామ అంబులెన్స్‌ కేటాయింపు
  • వచ్చే బడ్జెట్‌లో ఏరియా ఆసుపత్రికి నిధుల మంజూరుకు కృషి
  • ఖమ్మం ఎంపీ నామా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, జనవరి 25 : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు గాను అత్యాధునికమైన అంబులెన్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ఎంపీ నామా జిల్లాకు కేటాయించిన ఆరు అంబులెన్స్‌ల్లో సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి ఒక అంబులెన్స్‌ను కేటాయించి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లో సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణకు నిధులు మంజూరుకు కృషిచేస్తానన్నారు. కరోనాను జయించేందుకు భారతదేశం తొలిసారిగా వ్యాక్సిన్‌ కనిపెట్టి ఇప్పటికే పలువురు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ చేయిస్తున్న ఘనత దేశానికే దక్కిందన్నారు. త్వరలో ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చి కరోనాను నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్‌ హైవే గోతులమయంగా మారడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వసుమతిదేవి, మునిసిపల్‌ కమీషనర్‌ సుజాత, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, అన్ని పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

VIDEOS

logo