ఆదివారం 07 మార్చి 2021
Khammam - Jan 24, 2021 , 03:26:30

క్వింటా పత్తి గరిష్ట ధర రూ.5,750

క్వింటా పత్తి గరిష్ట ధర రూ.5,750

ఖమ్మం వ్యవసాయం, జనవరి 23: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరిసింది. దీంతో పంటను తెచ్చిన రైతులు మురిసిపోయారు. ఖమ్మం మార్కెట్లోనే కాకుండా.. ఈ సీజన్‌లో ఏకంగా జిల్లాలోనే పత్తి పంటకు అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. శనివారం పత్తి మార్కెట్లో జరిగిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో క్వింటాకు రూ.5,750 గరిష్ట ధర పలికింది. ప్రస్తుతం సీసీఐ రూ.5,725కి కొనుగోలు చేస్తోంది. అయితే ఉదయం క్రయవిక్రయాల్లో ప్రైవేట్‌ వ్యాపారులు సీసీఐ కంటే అధిక ధర పెట్టి కొనుగోలు చేయడం విశేషం. కొద్ది రోజులుగా పత్తి పంట మార్కెట్‌కు రావడం గణనీయంగా తగ్గింది. దీంతో ఉత్పత్తి తగ్గడం, జాతీయ మార్కెట్లో పంటకు డిమాండ్‌ పెరగడం వంటి కారణాలతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. 

VIDEOS

logo