మంగళవారం 02 మార్చి 2021
Khammam - Jan 24, 2021 , 03:26:43

డ్రైవరన్నా.. సలాం

డ్రైవరన్నా.. సలాం

  • డ్రైవర్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఆర్టీసీ
  • ఉత్తమ సేవలను గుర్తిస్తూ అవార్డులతో సత్కారం
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్స్‌ డే 

హైదరాబాద్‌, జనవరి 23(నమస్తే తెలంగాణ): మనల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో డ్రైవర్లదే కీలకపాత్ర. రెప్పపాటుకాలం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు. ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటూ, నిత్యం ప్రమాదాలతో సహవాసం చేసే డ్రైవర్ల సేవలు ఎనలేనివి.  జనవరి 24 డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కథనం..

ఒత్తిడిని జయించి.. ఏకాగ్రతతో పనిచేసేలా

ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో కలిసి 17,854 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో విధులు నిర్వర్తించేలా ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు చేయకుండా సురక్షితంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చుతూ సేవలందిస్తున్న వారికి రాష్ట్రస్థాయి, జోనల్‌ స్థాయి, రీజినల్‌ స్థాయిల్లో ముగ్గురు ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్నారు.  ఇలా ప్రతి చర్య ఉత్తమ ఫలితాలిస్తున్నదని ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ) పురుషోత్తం తెలిపారు. బస్సుల కండిషన్‌ మాదిరిగానే డ్రైవర్‌ ఫిట్‌నెస్‌కు సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు థామస్‌రెడ్డి తెలిపారు.  

ఏకాగ్రతతో ఉండాలి  

ఒకసారి డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న తర్వాత దృష్టంతా పనిమీదే ఉండాలి. ఎదుటివాళ్లు ఎలా వెళ్తున్నారనే అంశం కంటే మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామన్నదే లక్ష్యం కావాలి. 

 -గాయం నరేందర్‌రెడ్డి, రెండుసార్లు ఉత్తమ డ్రైవర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ డిపో

VIDEOS

logo