గురువారం 25 ఫిబ్రవరి 2021
Khammam - Jan 24, 2021 , 03:26:58

పనులను గడువులోగా పూర్తి చేయాలి

పనులను గడువులోగా పూర్తి చేయాలి

  • రూ.70 లక్షల అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి అజయ్‌

ఖమ్మం, జనవరి 23: పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. 32వ డివిజన్‌లో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డివైడర్ల పనులకు, 9వ డివిజన్‌లో మరో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. 42వ డివిజన్‌ రంగనాయకుల గుట్టలో కూడా 70లక్షలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల్లోనాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

VIDEOS

logo