మంగళవారం 02 మార్చి 2021
Khammam - Jan 23, 2021 , 02:01:51

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఖమ్మం సిటీ, జనవరి 22: పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పిల్లల ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఏడీసీపీ (అడ్మిన్‌) పూజ, ఏఆర్‌ ఏడీసీపీ మాధవరావు, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రమేశ్‌, ఏవో అక్తరున్నీసాబేగం, సీసీఆర్‌బీ ఏసీపీ ఎల్‌సీ నాయక్‌, ఏఆర్‌ ఏసీపీ విజయబాబు, ఆర్‌ఐలు రవి, సాంబశివరావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

అనారోగ్యంతో మరణించిన ఏఆర్‌ ఎస్సై షేక్‌ సోందు కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా సొమ్ముకు సంబంధించిన చెక్కును సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అందజేశారు. కమిషనరేట్‌లో బాధితుడి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చెక్కును ఇచ్చారు. 

VIDEOS

logo