బుధవారం 03 మార్చి 2021
Khammam - Jan 22, 2021 , 01:50:01

అవ్వకు అందిన బియ్యం

అవ్వకు అందిన బియ్యం

  • మంత్రి ఆదేశంతో స్పందించిన అధికారులు
  • మురిసిపోయిన వృద్ధురాలు

రఘునాథపాలెం, జనవరి 21 : సమస్యను ప్రశ్నించే వయస్సు కాదు.. పోరాడే ఓపికా అంతకన్నా లేదు. చెప్పుకుంటే తప్ప తీరుతుందని ఆ వయస్సులో ఆమెకు వచ్చిన ఆలోచన ఎంతో గొప్పది. ఊర్లోకి మంత్రి వస్తున్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకుంది ఓ వృద్ధురాలు. ఆ ఊరి పెద్దని బతిమాలుకొని మంత్రికి సమస్యను విన్నవించుకుంది. ఇంకేముంది.. ప్రజా శేయస్సు కాంక్షించి పనిచేసే మంత్రికి ఆ వృద్ధురాలి సమస్య తేలికపాటిది. ‘కొద్ది నెలలుగా కంట్రోల్‌ బియ్యం ఇస్తలేరు అయ్యా..! దిక్కుమొక్కులేని నేను మీరిచ్చే పింఛన్‌తోనే బతుకుతున్నా..! రేషన్‌ బియ్యం ఇప్పించి ఆదుకోండి సారూ..!’ అని ఇటివలే తన గ్రామానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ని కలిసి వేడుకున్న రఘునాథపాలేనికి చెందిన రేమళ్ల భద్రమ్మ సమస్య సమసిపోయింది. మంత్రి ఆదేశం మేరకు రఘునాథపాలెం నాయబ్‌ తహసీల్దార్‌ సురేశ్‌బాబు మరునాడు వృద్ధురాలిని  మీసేవ వద్దకు తీసుకెళ్లి బియ్యం పంపిణీలో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యకు పరిష్కారం చూపారు. వేలిముద్రలతో పాటు ఐరీష్‌ ద్వారా రేషన్‌ బియ్యం సులువుగా అందేలా చేశారు. ఆ తర్వాత రేషన్‌ షాపునకు తీసుకువచ్చి బియ్యం ఇప్పించడంతో ఆ అవ్వ ఆనందానికి అవధుల్లేవు. 

VIDEOS

logo