కొమరారం మండల కేంద్రం కసరత్తు

- జిల్లాలో కొత్త మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు
- వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు
- ఫలిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ కృషి
- హర్షం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీ వాసులు
ఇల్లెందు రూరల్, జనవరి 21 : జిల్లాలో మరొక కొత్త మండలం ఏర్పాటుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సెక్రటేరియేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టరేట్, జిల్లా పంచాయతీ కార్యాలయాల అధికారులు గురువారం మండల పరిషత్తు కార్యాలయం నుంచి కొమరారం కేంద్రంగా ఉన్న గ్రామపంచాయతీలు, జనాభా, విస్తీర్ణం వివరాలు సేకరించారు. 12 గ్రామపంచాయతీలతో కొమారారంను మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదికను అందజేశారు. ఈ 12 పంచాయతీల్లో 19,721 మంది జనాభా వేగవంతంగా సాగిన ఈ ప్రక్రియతో ఇల్లెందు ఏజెన్సీలో మరొక మండలం ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. మండల పరిషత్తు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరబోతోందంటూ ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 మండలాలతో రూపుదిద్దకున్న భదాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాల పునర్విభజన కారణంగా అదనంగా ఆరు మండలాలు ఏర్పాటయ్యాయి. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో కొమరారం ఏడో మండలంగా గుర్తింపు పొందనుంది.
ఉన్నతాధికారులకు వివరాలు అందజేశాం..
మండలంలోని కొమరారం కేంద్రంలో మరొక మండలం ఏర్పాటుకు ఉన్న అవకాశాలతో నివేదిక అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు కొమరారం కేంద్రంగా 12 గ్రామపంచాయతీలతో నివేదిక సిద్ధం చేసి సమర్పించాం.
- అరుణ్గౌడ్, పంచాయతీ అధికారి, ఇల్లెందు మండలం.
తాజావార్తలు
- అగ్ని ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
- ఇలియానా బోల్డ్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్స్
- స్నేహితురాలికి వేధింపులు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
- పెండ్లి చెడగొట్టాలని ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు
- చేపల విక్రయ వాహనాలనుత్వరగా అందజేయండి
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది