కన్నింగ్ ఖరీదుదారులు

- ఖమ్మం ఏఎంసీలో పొరుగు రాష్ర్టాల వ్యాపారుల పాగా
- ఏటా మిర్చి సీజన్లో ఎగవేతకు యత్నాలు
- అత్యాశకు పోయి ఆగమవుతున్న అడ్తీ, కటింగ్ వ్యాపారులు
- తాజాగా మరో ఆంధ్రావ్యాపారిపై అనుమానాలు
ఖమ్మం వ్యవసాయం, జనవరి 21: అడ్తీ వ్యాపారుల బలహీనతను ఆసరాగా చేసుకోవడం, అందినకాడికి దోచుకుంటున్న కన్నింగ్ ఖరీదుదారుల వ్యవహారశైలి ఖమ్మం ఏఎంసీలో కమిషన్ వ్యాపారులను కలవర పెడుతోంది. స్థానిక ఖరీదు దారులు కొందరు ఆర్థికంగా చితికిపోవడంతో ఏటేటా ఇతర ప్రాంతాల నుంచి ఖరీదుదారుల తాకిడి పెరుగుతోంది. అయితే వారి గుణగణాలు, వ్యవహారశైలి తెలియకపోవడంతో అడ్తీ వ్యాపారులు, కటింగ్ బిల్లులు ఇచ్చే వ్యాపారులు ఇబ్బందుల పాలవుతున్నారు. మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేటొళ్లం ఉంటారనే సంకేతాలు ఇస్తూ అందిన కాడికి దోచుకొని అవతల పడుతున్న వారు కొందరైతే నష్టాల పాలయ్యాయని ఎగవేతకు పాల్పడే వారు మరికొందరు ఖరీదుదారులు పుట్టుకొస్తున్నారు. ప్రస్తుతం నగర వ్యవసాయ మార్కెట్లో కమీషన్ వ్యాపారులు(అడ్తీ)లతో పాటు ఖరీదుదారులు(కొనుగోలుదారులు) క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నారు. అటు కమీషన్, ఇటు ఖరీదుదారులకు అప్పటికప్పుడు అవసరమైన మేర డబ్బులు వడ్డీకి ఇచ్చే వారు కటింగ్ వ్యాపారులు అయితే వీరి పాత్ర మాత్రం అనధికారంగా కొనసాగుతుంది. జేబులో చిల్లి గవ్వ లేని వ్యక్తులు సైతం లైసెన్స్ తీసుకోవడం, కటింగ్ వ్యాపారుల సహాయంతో దందా చేయడం పరిపాటిగా మారింది. అవసరాల కోసం ఏర్పాటైన కటింగ్ వ్యవస్థ నేడు కన్నింగ్ వ్యాపారులకు ఎగవేతకు మార్గం సుగమం చేసిందనే చర్చ ఉంది.
తాజాగా మరో ఆంధ్రా వ్యాపారి కలకలం..
దాదాపు ఐదు నెలల కిత్రం మార్కెటింగ్‌శాఖలో ఖరీదులైసెన్స్ తీసుకొని మిర్చి వ్యాపారం చేస్తున్న ఆంధ్రా వ్యాపారి వైఖరి మరోసారి కమీషన్ వ్యాపారులకు ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్టా జిల్లాకు చెందిన ఓ వ్యాపారి గత ఐదు నెలల నుంచి నగర మార్కెట్లో స్థానికంగా గుమస్తాలను నియమించుకొని ఖమ్మం, మహబూబాబాద్ మార్కెట్లో మిర్చిపంట క్రయవిక్రయాలు చేపట్టాడు. ప్రారంభంలో అతను పెట్టిన ధర, సకాలంలో చెల్లించిన చెల్లింపులను పరిగణంలోకి తీసుకొని అనేక మంది కమీషన్ వ్యాపారులు పంటను విక్రయించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి చెల్లింపులు లేకపోవడంతో అనుమానం కలిగిన అడ్తీ వ్యాపారులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సదరు వ్యాపారి నివాసానికి వెళ్లి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కనీసం సెల్‌ఫోన్‌కు సైతం స్పందికపోవడంతో అతనికి పంటను అమ్మిన కమీషన్ వ్యాపారులు, కటింగ్ బిల్లులు పెట్టిన వారితో పాటు, చిన్న మొత్తంలో పంటను కొనుగోలు చేసి తిరిగి ఈ వ్యాపారికి పంటను అమ్మిన చిల్లర వ్యాపారాలు ఆందోళనలో ఉన్నారు.
ఏటా సీజన్లో ఎగవేతకు యత్నాలు..
నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి, మిర్చి పంటలే రైతులు అధికంగా తీసుకువస్తుంటారు. పత్తిని ఎక్కువ మొత్తంలో సీసీఐ కొనుగోళ్లు చేస్తుండటంతో ఖరీదుదారుల ఎగవేతలు తక్కువగానే ఉంటాయి. మిర్చి పంటకు మద్దతు ధర లేకపోవడం, ఖమ్మం ఏఎంసీకి మాత్రమే ఎక్కడ లేని విధంగా తేజా పంట వస్తుండటంతో మిర్చి ఖరదుదారులకు కేరాఫ్‌గా మారింది. సీజన్‌కు ముందుగానే ఖరీదుదారులు పక్కా ప్రణాళికతో లైసెన్స్ తీసుకొని అడ్తీ వ్యాపారులను ఆకర్షించేందుకు తోటి వ్యాపారులకుంటే అధికంగా ధర పెట్టడం, రెండు, మూడు ఖరీదుదారులకు సమయానికి అనుగుణంగా చెల్లింపులు చేసి బట్టులో వేసుకుంటున్నారు. ఆ తరువాత వాయిదాలమీద వాయిదాలు పెట్టడం నష్టం వచ్చిందని ముఖం చాటేయడం సీజనల్‌గా మారింది. గడిచిన రెండు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన వ్యాపారి ఇదే తరహాలో ముఖం చాటేయగా, గతేడాది మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన వ్యాపారి వంతైంది.
తాజావార్తలు
- బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్‌పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- ఆశపెట్టి.. దోచేస్తారు
- గేమ్ ఓవర్.. గ్రూప్ డిలీట్
- ఒంటరి మహిళలు.. ఒంటిపై నగలే టార్గెట్
- 04-03-2021 గురువారం.. మీ రాశి ఫలాలు