గురువారం 04 మార్చి 2021
Khammam - Jan 20, 2021 , 02:40:20

చింతపల్లిలో కలెక్టర్‌ కర్ణన్‌..

చింతపల్లిలో కలెక్టర్‌ కర్ణన్‌..

ఖమ్మం రూరల్‌, జనవరి 19 : మండల పరిధిలోని చింతపల్లి అతిథులైన సైబీరియా కొంగలను చూసేందుకు మరో అథిధి ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ దంపతులు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. సుమారు వారు గంటకు పైగా గ్రామంలో కలియతిరిగి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. తమ చిన్నారులకు వాటి విశిష్టతను వివరించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ.. ‘నమస్తే’లో ప్రచురితమైన ప్రత్యేక కథనాన్ని చదివి గ్రామానికి వచ్చానని అన్నారు. పక్షులు ఎప్పటి నుంచి వస్తున్నాయి.. ఎప్పటి వరకు ఉంటాయి.. వాటి ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. పక్షుల గురించి వాటి జీవిత చరిత్ర, జీవన గమనాన్ని ఆర్‌ఐ నరేశ్‌, స్థానికులు రామకృష్ణ వివరించారు.   

VIDEOS

logo