రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు

- గతేడాది ఉమ్మడి జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు
- 2019 కంటే రూ.533.44 కోట్ల మద్యం అధికంగా విక్రయం
- లాక్డౌన్లోనూ తగ్గని అమ్మకాలు
- బీర్ల కంటే ఐఎంఎల్ విక్రయాలే అధికం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం ప్రియులు గత ఏడాదిలో తెగ తాగేశారు. రూ.100కోట్లు కాదు, రూ.200కోట్లు కాదు, ఏకంగా ఒక ఏడాదిలో రూ.1883.40కోట్ల మద్యాన్ని తాగారు. 2020లో కరోనా వ్యాప్తితో లాక్డౌన్ కొనసాగినప్పటికీ 2019లో కంటే గత ఏడాది అధికంగా మద్యాన్ని తాగారు. 2019లో రూ.1349.96కోట్ల మద్యాన్ని విక్రయించగా, 2020లో విక్రయాలు రూ.1883.40కోట్లకు పైగా చేరుకున్నాయి. గతేడాది రూ.533.44కోట్ల మద్యాన్ని అధికంగా తాగారు. లాక్డౌన్ ప్రభావంతో బీర్ల విక్రయాలు తగ్గినా ఐఎంఎల్ విక్రయాలు భారీగా పెరిగాయి.
వైరా, జనవరి 19 : ఆనందమైనా, బాధైనా మందేయాల్సిందే.. సంతోషమొచ్చినా మద్యం తాగడం మందు ప్రియులకు పరిపాటిగా మారింది. చిన్న శుభకార్యంతో మొదలుకొని ఏ కార్యక్రమమైనా మందు లేనిదే నడవదంటే అతిశయోక్తి కాదేమో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 165 వైన్ షాపులు, 47 బార్లు, 3 క్లబ్ల్లో మద్యం విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం ధరను గత ఏడాది కొంతమేరకు పెంచినప్పటికీ మద్యానికి బానిసైన వారు వెనుకాడటం లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీంతో 2020 ఏప్రిల్లో ఐఎంఎల్ డిపో నుంచి మద్యం విక్రయాలు జరగలేదు. అయినప్పటికీ రూ.533.44కోట్లు అదనంగా మద్యం విక్రయాలు జరిగాయి.
గల్లీగల్లీకో బెల్టు షాపు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల్లీగల్లీకో బెల్టు షాపు ఉంది. ఈ షాపుల్లో 24 గంటలూ మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. బెల్టు షాపుల్లో ఎంఆర్పీ కంటే 25% మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల్లో మద్యాన్ని విక్రయించడంతో ఆయా మండలాల్లోని మద్యం వ్యాపారులకు కాసుల పంట పండుతున్నది.
2020 జూలైలో అధికంగా రూ.211.20కోట్ల మద్యం విక్రయం..
గత ఏడాది జులై నెలలో అధికంగా రూ.211.20కోట్లకు పైగా మద్యాన్ని విక్రయించారు. ఈ ఏడాది అత్యల్పంగా మార్చి నెలలో రూ.98.57కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగారు. వైరా ఐఎంఎల్ డిపో చరిత్రలో అత్యధిక మద్యం అమ్మిన నెలగా 2020 జులై నెల రికార్డుకు ఎక్కింది. అదేవిధంగా 2019లో డిసెంబర్ నెలలో అధికంగా రూ.129.39కోట్ల మద్యాన్ని విక్రయించగా, మార్చి నెలలో అత్యల్పంగా రూ.98కోట్ల మద్యాన్ని విక్రయించారు.
తాజావార్తలు
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్
- శ్రీవారికి పోస్కో భారీ విరాళం