మంగళవారం 09 మార్చి 2021
Khammam - Jan 19, 2021 , 01:28:25

ఉమ్మడి జిల్లాలో 1298 మందికి వ్యాక్సిన్‌

ఉమ్మడి జిల్లాలో 1298 మందికి వ్యాక్సిన్‌

టీకా కార్యక్రమాలను పరిశీలించిన 

కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి

ఖమ్మం, జనవరి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ సజావుగా సాగుతున్నది. ఈ నెల 16న లాంఛనంగా ప్రారంభమైన టీకా కార్యక్రమంపై ప్రజలకు కూడా అపోహలు తొలగిపోయాయి. రెండో విడతగా సోమవారం రెండు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ సాగింది. వైద్యులు ఖమ్మం జిల్లాలోని 15 కేంద్రాల్లో 750 మందికి గాను 599 మందికి టీకా వేశారు. ఖమ్మంలో తొలి టీకాను ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌  వెంకటేశ్వర్లుకు వేశారు. భద్రాద్రి జిల్లాలో 10 కేంద్రాల్లో 700 గాను మందికి 699 మంది హెల్త్‌వర్కర్లకు వ్యాక్సిన్‌ వేశారు.  

ఆరోగ్య విభాగంలో అందరికీ టీకా..

ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

మయూరిసెంటర్‌, జనవరి 18: జిల్లాలో కొవిడ్‌ విధులు నిర్వర్తించిన ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌.. వైద్యాధికారులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

టీకాపై అపోహలు వద్దు 

భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం జనవరి 18: భద్రాద్రి జిల్లాలో రెండోరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. టీకాపై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దన్నారు. డీఎంహెచ్‌వో, డీఐఓలు, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షకులు నిరంతరం టీకా కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. సమష్టిగా పనిచేసి వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలన్నారు. 

ప్రజలకు అవగాహన కల్పించాలి

వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌

వైరా, జనవరి18: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో ఆరోగ్య కార్యకర్తలు విశేష కృషి చేశారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై హెల్త్‌వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. వ్యాక్సిన్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని అన్నారు. త్వరలో అందరికీ వ్యాక్సిన్‌అందుతుదన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, దార్న రాజశేఖర్‌, కాపా మురళీకృష్ణ, కట్టా కృష్ణార్జున్‌రావు, దారెల్లి కోటయ్య, వనమా విశ్వేశ్వరరావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo