శనివారం 06 మార్చి 2021
Khammam - Jan 17, 2021 , 02:46:11

రఘునాథపాలేన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

రఘునాథపాలేన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

  • ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతి వనాలు
  • అభివృద్ధ్ది పనుల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్

రఘునాథపాలెం, జనవరి 16: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలమైన రఘునాథపాలేన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఆయన రఘునాథపాలెంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డులు, గణేశ్వరంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకే పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వనంలో ఓపెన్‌ జిమ్‌  ఏర్పాటుకు దాతల సహకారాన్ని కోరాలని మంత్రి సూచించారు. బాలాజీ ఎస్టేట్స్‌ అధినేత వత్సవాయి రవి ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. డంపింగ్‌ యార్డును ఊరికి దూరంగా ఏర్పాటు చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, సర్పంచ్‌ గుడిపుడి శారద, ఉప సర్పంచ్‌ కుందేసాహెబ్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌ తాతా రఘురాం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ దొంతు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిపుడి రామారావు, నున్నా శ్రీనివాసరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, నున్నా వెంకటేశ్వరరావు, గొర్రె శ్రీనివాసరావు, విజయ్‌రెడ్డి, నంద్యా, నల్లమోతు శ్రీనివాసరావు, గణేశ్వరం సర్పంచ్‌ యాసా నీలిమ, యాసా రామారావు, మాజీ సర్పంచ్‌ జోగు ఎల్లబాబు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీడీవో వాసిరెడ్డి అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo