బుధవారం 27 జనవరి 2021
Khammam - Jan 14, 2021 , 00:03:15

భోగభాగ్యాలతో విలసిల్లాలి

భోగభాగ్యాలతో విలసిల్లాలి

ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సంక్రాంతి శుభాకాంక్షలు

ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా ప్రజలందరూ సిరిసంపదలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్‌, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్లు, హరిప్రియ, ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీరెడ్డి, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యురాలు బాణోత్‌ చంద్రావతి, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు బుధవారం వారు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, పచ్చతోరణాలు, పాడి పంటలతో ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.


logo