ప్రతి ఇంటికి శుద్ధజలం

‘మిషన్ భగీరథతో తాగునీటికి శాశ్వత పరిష్కారం
చివరి దశకు చేరిన ఇంట్రా కనెక్షన్ పనులు
ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రయోజనం
700 గ్రామాలకు నీటి సరఫరా
తాగునీటి సమస్యకు వందకు వందశాతం శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి శుద్ధజలం సరాఫరా కానున్నది. పాలేరు నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చేపట్టిన పనులన్నీ పూర్తికావచ్చాయి. ఇంట్రా కనెక్షన్ పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. భారీ వ్యయంతో చేపట్టిన ఈ పథకం త్వరలో లక్ష్యాన్ని పూర్తి చేసుకోనుంది. పాలేరు ఇన్‌టెక్ వెల్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 700 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనున్నది. - కూసుమంచి, జనవరి 13
పాలేరు జలాశయం నుంచి అందించే నీటితో ప్రజల తాగునీటి కష్టాలు పూర్తిస్థాయిలో తీరనున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నా కొన్ని గ్రామాలకు పనులు పూర్తికాకపోవడంతో తాగునీరు అందడం లేదు. అధికారుల నిరంతర పర్యవేక్షణతో ఈ సమస్యలను అధిగమించి పనులన్నీ పూర్తి చేశారు.ఇన్‌టేక్ వెల్, పైపులైన్, సంప్‌లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు పూర్తయ్యాయి. పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం కార్పొరేషన్, 375 ఇతర ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా బిగించారు. త్వరలో ప్రతి ఇంటికీ తాగునీరు అందనున్నది.
జీళ్లచెరువులో సక్సెస్ అయిన డబ్ల్య్లూటీపీ..
పాలేరు నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని జీళ్ళచెరువులో నిర్మించిన డబ్ల్య్లూటీపీ విజయవంతంగా పనిచేసున్నది. నేలకొండపల్లి మండలంలో 75 మంచినీటి ట్యాంక్‌లు, కూసుమంచిలో 79 మంచినీటి ట్యాంక్‌లు, ఖమ్మం రూరల్‌లో 76 మంచి నీటి ట్యాంక్‌ల వరకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. నేలకొండపల్లి భైరవునిపల్లి వరకు తిరుమలాయపాలెం నుంచి గూడురుపాడు వరకు నీటిని పంపించారు. ఇంట్రాకలెక్షన్లు ఇప్పటికే 90 శాతం పూర్తి అవ్వగా వాటిని ఇంకా కొన్ని ప్రాంతాల్లో అనుసంధానం చేయాల్సి ఉంది.
రెండు జిల్లాలకు స్వచ్ఛమైన తాగునీరు
కూసుమంచి మండలం పాలేరు జలాశయం వద్ద ఇన్‌టేక్ వెల్‌ను నిర్మించారు. ఇన్‌టేక్ వెల్‌లో ఏర్పాటు చేసిన 12 మోటార్ల ద్వారా ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామాలతో కలిపి మొత్తం 700 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.
పాలేరు నుంచి జీళ్ల చెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. జీళ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన సంప్‌లో నీటిని శుద్ధి చేసి ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని 111 ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు.
మాదిరీపురం వద్ద ఏర్పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భగీరథ నీరు అందుతున్నది.
పాలేరు నుంచి మాదిరీపురం వద్ద ఏర్పాటు చేసిన సంప్‌లో నీటిని తీసుకొచ్చి శుద్ధి చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుమారు 300 గ్రామాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందుతుంది.
రెండు జిల్లాల్లో కలిపి సుమారు 7 లక్షల మందికి పాలేరు నుంచి తాగునీరు అందుతున్నది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాలకు కూడా మాదిరీపురం సంప్ నుంచే నీరు అందుతున్నది.
ప్రతీ రోజు ల్యాబ్ పరీక్షలతో శుద్ధి చేసిన జలాలను ప్రజలకు తాగునీరుగా అందిస్తున్నారు.
తాజావార్తలు
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!