శనివారం 23 జనవరి 2021
Khammam - Dec 06, 2020 , 00:48:06

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలి

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలి

  • పనుల పరిశీలనలో కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం : ఖమ్మం నగరంలో ఈ నెల 7న ప్రారంభోత్సవాలు జరుగనున్న అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పరిశీలించారు. ఐటీ హబ్‌, ఎన్నెస్పీ వాక్‌వే, బల్లేపల్లి వైకుంఠధామం, పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ శిలాఫలాకాల ఏర్పాటు, సభ ప్రాంగణం ఏర్పాట్లపై అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఐటీ హబ్‌లో సభా కార్యక్రమం ఉన్నందున సభావేదిక ఏర్పాట్లను త్వ రగా పూర్తి చేయాలని ఆదేశించారు. బల్లేపల్లి వైకుంఠదామం ప్రారంభోత్సవానికి పూర్తి సిద్ధంగా ఉండాలని, ప్రారంభోత్సవ శిలఫలాకలు ఏర్పాటు పనులను, మిగిలి ఉన్న ముగింపు పనులను శనివారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నెస్పీ వాక్‌వే ప్రవేశమార్గాలు, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, గ్రీనరీ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు కమిషనరేట్‌ భవనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన ఉన్నందున శనివారం సాయంత్రానికి పనులు పూర్తి కావాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌జయంతి, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo