గురువారం 04 మార్చి 2021
Khammam - Dec 04, 2020 , 04:00:11

తెలంగాణాలోనే సత్తుపల్లికి ప్రత్యేకస్థానం

తెలంగాణాలోనే సత్తుపల్లికి ప్రత్యేకస్థానం

  • సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
  • రాజీవ్‌కాలనీలో 2.26కోట్లతో సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన
  • సంక్రాంతికి ప్రారంభం : ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి: తెలంగాణాలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేకస్థానం ఉందని.. ప్రత్యేక కృషితో అభివృద్ధిపథంలో నడిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టీఎఫ్‌ఐడీసీ నిధులతో ఎన్నో అభివృద్ధికార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా రాజీవ్‌కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం..సీసీరోడ్లకు, డ్రైన్లకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సిద్ధారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని తర్వాత సత్తుపల్లి మున్సిపాలిటీలో ప్రత్యేక వార్డుగా కేటాయించి టీఎఫ్‌ఐడీసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పాలకవర్గం ఏర్పడి ఏడాది గడవకముందే రాజీవ్‌కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, 23 కౌన్సిలర్లు మొత్తం గెలవడంతో అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సిద్ధారం రోడ్లు డబుల్‌రోడ్డుగా చేయాలనేది ముఖ్య ఉద్దేశమని సత్తుపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దామని దాని ప్రారంభోత్సవం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో చేయించనున్నట్లు తెలిపారు. రూ.2 కోట్లతో షాదీఖానా, క్రిస్టియన్లకు కమ్యూనిటీహాల్‌ కోసం వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. అరుదైన జంతువులను పెంచేందుకు, వాకర్స్‌ ట్రాక్‌ కోసం అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని సత్తుపల్లిలో మినీట్యాంక్‌ బండ్‌ సమకూర్చాలని ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు మున్సిపాలిటీలో రూ.పదివేలలోపు ఇంటి పన్ను ఉన్నవారికి 50శాతం రాయితీతో కోటి25లక్షలు భారం తగ్గించామన్నారు. అలాగే మున్సిపాలిటీకి కావాల్సిన ఆటోలు, మినీ జేసీబీ, సత్తుపల్లి నుంచి ఖమ్మం రోడ్డు, సత్తుపల్లి నుంచి ఊరి బయటకు రోడ్లు వేసేందుకు టెండర్లు పూర్తయ్యాయని రాష్ట్ర రహదారుల కోసం రూ.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో రాజీవ్‌కాలనీ, వెంగళరావునగర్‌, ద్వారకాపురి, జలగంనగర్‌ వాసులకు ఇండ్ల పట్టాలు ఏర్పాటు చేస్తామని ఎన్నో ఎండ్లుగా పేద ప్రజలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఫారెస్ట్‌ భూములను పేద ప్రజలకు అందించేవిధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరుతో సత్తుపల్లి అభివృద్ధికి కృషి చేశానని, 95శాతం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సైడ్‌ డ్రైన్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీపీ దొడ్డాహైమావతి శంకర్‌రావు, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వైస్‌చైర్మన్‌ తోట సుజలారాణి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కమిషనర్‌ సుజాత, ఎంఆర్‌వో మీనన్‌, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, నాయకులు గాదెసత్యం, మండపాటి ముత్తారెడ్డి, అమరవరపు కృష్ణారావు, గఫార్‌, షరీఫ్‌, కంటె అప్పారావు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo