ఆదివారం 24 జనవరి 2021
Khammam - Dec 03, 2020 , 02:27:32

ఖమ్మం జిల్లా జడ్జి బదిలీ

ఖమ్మం జిల్లా జడ్జి బదిలీ

ఖమ్మం లీగల్‌ :  జిల్లా జడ్జిగా పనిచేస్తున్న ఎం.లక్ష్మణ్‌ బదిలీ అయ్యారు.  హైదరాబాద్‌లోని కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీ  చేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా జడ్జిగా సీహెచ్‌.కె భూపతిని నియమించింది. భూపతి అడిషనల్‌ డైరెక్టర్‌, తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ అకాడమీ సికింద్రాబాద్‌లో పనిచేస్తూ బదిలీపై ఖమ్మం వస్తున్నారు. ఎం.లక్ష్మణ్‌ జిల్లా జడ్జిగా గత 4సంవత్సరాలుగా ఖమ్మం కోర్టు ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. లోక్‌ అదాలత్‌ ద్వారా అనేక కేసుల పరిష్కారానికి కృషి చేశారు. 


logo