ఆదివారం 24 జనవరి 2021
Khammam - Dec 03, 2020 , 02:27:32

సిద్ధమవుతున్న పోలీస్‌ కమిషనరేట్‌ భవనం

సిద్ధమవుతున్న పోలీస్‌ కమిషనరేట్‌ భవనం

ఖమ్మం సిటీ: నగరంలోని ప్రకాష్‌నగర్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆవరణలో పోలీస్‌ కమిషనరేట్‌ నూతన భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్నది. నిర్మాణ పనులను, భవనంలోని వసతులను బుధవారం సీపీ తఫ్సీర్‌ ఇక్భాల్‌ పరిశీలించారు. ఇది మరికొద్ది రోజుల్లోనే ప్రారంభానికి సిద్ధమవుతుంది. భవనానికి తుది మెరుగుల పనులను తక్షణమే పూర్తిచేయాలని సంబందిత అధికారులను సీపీ ఆదేశించారు. ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీఐ శ్రీధర్‌, ఆర్‌ఐ సాంబశివరావు, హౌసింగ్‌ బోర్డు అధికారులు పాల్గొన్నారు.


logo