బుధవారం 27 జనవరి 2021
Khammam - Dec 02, 2020 , 03:38:38

పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఖమ్మం : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రచురించారు. ఓటర్ల జాబితా ప్రకారం పురుషులు 52,059 మంది, స్త్రీలు 29,090 మంది, ఇతరులు 11 మంది మొత్తం 81,160 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 107 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఓటర్ల ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 31 లోపు తెలియజేయాలని అన్నారు.

భద్రాద్రి జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 39938..

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరు ముసాయిదాను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మొత్తం 39,938 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకున్నారని, వీరు ఓటు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 39,938 మంది ఓటర్లలో పురుషులు 23,798, మహిళలు 16129, ఇతరులు 11 మంది ఉన్నారని ఆయన తెలిపారు.  


logo