సోమవారం 01 మార్చి 2021
Khammam - Nov 28, 2020 , 01:03:20

రాజకీయ పార్టీలు సహకరించాలి

రాజకీయ పార్టీలు సహకరించాలి

  • అర్హులైన వారంతా ఓటు హక్కు  నమోదు చేసుకోవాలి
  • రెండు విడుతల్లో స్పెషల్‌ క్యాంపెన్‌
  • ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ఇ.శ్రీధర్‌
  • నాయకుల సహకారం అవసరం 
  • :కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఓటరు జాబితా పక్కాగా ఉందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ , గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రటరీ ఇ.శ్రీధర్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏటా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ చేపట్టిందన్నారు. ఎన్నికల అధికారులు ఓటరు జాబితాను ఇష్టానుసారంగా మారుస్తున్నారనే ఫిర్యాదులు అందడం వల్ల ఎన్నికల సంఘం కొన్ని మార్పులు తెచ్చిందన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు బూత్‌ లెవల్‌ అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెన్‌ నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో రెండవ విడత స్పెషల్‌ క్యాంపెన్‌ ఉంటుందన్నారు.

నాయకుల సహకారం అవసరం

ఖమ్మం జిల్లాలో జరిగిన పార్లమెంట్‌, అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ,ప్రతి ఎన్నికలలోను రాజకీయ పార్టీలు సహకరించాయని కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు.జి ల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఎస్సీ, ఒకటి ఎస్టీ రిజర్వ్‌డ్‌తో పాటు రెండు జనరల్‌ నియోజకవర్గాలు ఉన్నాయని, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి నగర పాలక సంస్థ కమిషనర్‌, పాలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి డిప్యూటీ కలెక్టర్‌, మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి, సత్తుపల్లి నియోజకవర్గానికి కల్లూరు రెవిన్యూ డివిజనల్‌ అధికారి, వైరా నియోజకవర్గానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా ఉన్నారని కలెక్టర్‌ అన్నారు.వీరితో పాటు తహాసీల్దార్లు ఏఆర్వోలుగా ఉన్నారని అన్నారు.ఐదు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1363 పోలింగ్‌ కేంద్రాలు, 694 పోలింగ్‌ స్టేషన్‌ లోకేషన్‌లు ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. జిల్లా జనాభా 14 లక్షల 99వేల 487 కాగా 11 లక్షల 28వేల 562 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో 2020 ఫిబ్రవరి 7 నుండి 2020 నవంబర్‌ 26 వరకు ఫారమ్‌-6 క్లయిమ్‌లు 8346 స్వీకరించగా ఇప్పటి వరకు 4440 క్లయిమ్స్‌ డిస్‌పోస్‌ చేవామని ఫారమ్‌-7 కు సంబంధించి 1454 క్లయిమ్స్‌కు గాను 872 క్లయిమ్స్‌ డిస్‌పోస్‌ అయ్యాయన్నారు.అదేవిధంగా ఫారమ్‌-8కు సంబంధించి 2686 క్లయిమ్స్‌గాను 1776 , ఫారం8-ఏ క్లయిమ్స్‌ 608కు గాను 454 క్లయిమ్స్‌ డిస్‌పోస్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు అనురాగ్‌ జయంతి, ఆర్‌.దశరథ్‌, ఆర్‌.శిరీషా, సీహెచ్‌ సూర్యనారాయణ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజేపి నుండి జి.విధ్యాసాగర్‌, కాంగ్రెస్‌ నుంచి ఎం.నరేందర్‌ ,టిఆర్‌ఎస్‌ నుంచి ఆర్జేసీ కృష్ణ, సీపీఐ నుంచి వెంకటేశ్వరరావు, సీపీఎం నుంచి ప్రకాశ్‌, బీఎస్పీ నుంచి బి.ఉపేందర్‌ సాహూ, టీడీపీ నుంచి సీతయ్య పాల్గొన్నారు. 


VIDEOS

logo